Peddi: ఓవర్సీస్‌ లో రామ్ చరణ్ సంచలనం. ‘పెద్ది' టికెట్ ధర 40 డాలర్లా?

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'పెద్ది' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు నటిస్తున్న సినిమా కావడం, మరోవైపు రామ్ చరణ్ పూర్తిగా డిఫరెంట్ రూరల్ మాస్ అవతార్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. తాజాగా ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో 'పెద్ది' సృష్టిస్తున్న సంచలనం ఇప్పుడు ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది.

జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా.. అమెరికాలో మాత్రం జూన్ 3 నుంచి ప్రీమియర్లతో సందడి చేయనుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి నార్త్ అమెరికాలో భారీ డిమాండ్ ఏర్పడింది. విడుదలకు ఇంకా కొన్ని వారాలు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. కొద్ది గంటల్లోనే ప్రీ-సేల్స్ 100K డాలర్ల మార్క్‌ను దాటేసింది. అయితే.. తాజాగా 200K+ కలెక్షన్స్‌ను కూడా దాటినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "$200K & Counting" అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Peddi USA Ticket Prices Shock Fans as Ram Charan Film Creates Overseas Records

ఈ సినిమా ఓవర్స్‌లో ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే 5000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సూచిస్తున్నాయి. ఇది కేవలం ప్రారంభమేనని.. రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత వేగం పెరుగుతాయని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల్లో 'పెద్ది'పై భారీ ఆసక్తి నెలకొంది.

అయితే ఈ భారీ హైప్ మధ్య ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే యూఎస్ టికెట్ రేట్లు. కొన్ని థియేటర్లలో 'పెద్ది' ప్రీమియర్ టికెట్ ధర $38గా ఉండగా.. ట్యాక్స్, ఆన్‌లైన్ బుకింగ్ ఛార్జీలు కలిపితే $40 నుంచి $42 వరకు వెళ్తుందని నెటిజన్లు చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఓ తెలుగు సినీ అభిమాని చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. "ఇది RRRనా? లేక బాహుబలి 2: ది కన్‌క్లూజన్నా? 40 డాలర్లు టికెట్ పెట్టేంత మాగ్నమ్ ఓపస్ మూవీనా?" అంటూ ప్రశ్నించారు.

"సినిమా బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నా. అయినా ఒక్క టికెట్‌కి 38 నటుడు అంటే చాలా ఎక్కువ. హాలీవుడ్ పెద్ద సినిమాలకు కూడా ఇంత రేటు ఉండదు" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. "ఇలా ప్రేక్షకులపై భారం పెడితే భవిష్యత్తులో ఓవర్సీస్ మార్కెట్‌కే నష్టం జరుగుతుంది" అని హెచ్చరించాడు. ముఖ్యంగా బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా అమెరికాలో $15 నుంచి $20 మధ్య టికెట్ ధరలు పెడుతుంటే.. 'పెద్ది'కి ఈ స్థాయి రేట్లు పెట్టడంపై సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. కొందరు "రామ్ చరణ్ క్రేజ్ వల్లే ఈ రేట్లు" అంటుంటే.. మరికొందరు "ఓవర్ హైప్ కారణంగా ప్రేక్షకులను దోచుకుంటున్నారు" అంటూ విమర్శిస్తున్నారు.

ఈ విమర్శలపై ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా స్పందించింది. "ప్రతి థియేటర్‌కి కావలసిన ధరలు ఉంటాయి. PLF, D-BOX, IMAX వంటి స్పెషల్ ఫార్మాట్‌లకు అదనపు ఛార్జీలు ఉంటాయి. ట్యాక్స్‌లు రాష్ట్రాలు వారీగా మారుతాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ఫీజులు కూడా కలుస్తాయి" అని వివరణ ఇచ్చింది. ఒకే స్క్రీన్‌షాట్ ఆధారంగా టికెట్ ధరలను జనరలైజ్ చేయొద్దని స్పష్టం చేసింది. అంతేకాదు, అధికారిక టికెట్ ధరలను కూడా చూపించారు. తెలుగు ప్రీమియర్‌లకు స్టాండర్డ్ 2D ధర $25/$20గా ఉంటుందని.. PLF కోసం అదనంగా $5, స్పెషల్ ఫార్మాట్‌లకు $7-$10 అదనంగా ఉన్నట్లు గుర్తించబడింది. ఫస్ట్ వీక్‌లో సాధారణ టికెట్ ధరలు $20/$18గా ఉండేందుకు అందుబాటులో ఉన్నాయి. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్లకు ప్రత్యేక ప్రీమియర్లు ఉండవని కూడా స్పష్టం చేసింది.

ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్‌లో తెలుగు సినిమాల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు మొదటి మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు అధిక టికెట్ ధరలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే అదే సమయంలో ఇలాంటి సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు దూరం చేసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.

'పెద్ది' సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడానికి మరో ప్రధాన కారణం కథాంశం. 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పూర్తిగా డీ-గ్లామర్, రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. 'పహిల్వాన్' తరహా పవర్ ఫుల్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు ప్రచారం. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సత్య పాత్రల్లో కనిపించనున్నారు. విడుదలకు ముందే ఓవర్సీస్‌లో ఈ స్థాయి హైప్ రావడం చూస్తుంటే.. 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Read more about: buchi babu sana ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X