Pelli Kani Prasad Collections: షాకింగ్‌గా పెళ్లి కాని ప్రసాద్ కలెక్షన్లు.. ఎన్ని లక్షల వసూళ్లంటే?
తెలుగు సినిమా రంగంలో టాప్ కమెడియన్ సప్తగిరి నటించిన పెళ్లికాని ప్రసాద్ చిత్రం మార్చి 21వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. యువ దర్శకుడు అభిలాష్ రెడ్డి గోపిడి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రియాంక శర్మ, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, భాషా, శ్రీనివాస్, ప్రభావతి, రోహిణి, రాంప్రసాద్ తదితరులు నటించారు. థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ సినిమా భారీ తారాగాణంతో రూపొందింది. కథ డిమాండ్ చేయడంతో ఎక్కువ క్యారెక్టర్లు, అలాగే టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. అలాగే ఫారిన్‌లో షూటింగ్ కారణంగా బడ్జెట్ కూడా సప్తగిరి సినిమాలతో పోల్చుకొంటే భారీగానే అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు తెలిసింది.

అయితే ఈ చిత్రం కంటెంట్‌పై నిర్మాతలకు కాన్ఫిడెన్స్ ఉండటంతో సొంతంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పంపిణీ చేశారు. దాదాపు ఈ సినిమాను 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ప్రమోషనల్ కంటెంట్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆశాజనకంగానే ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
సప్తగిరి నటించిన ఈ చిత్రంలో కొత్తదనం లేదనే కామెంట్ వినిపించింది. దాంతో ఈ సినిమాపై క్రిటిక్స్, ప్రేక్షకులు నెగిటివ్‌గా స్పందించారు. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపించింది. తొలి ఆటకు మంచి ఆక్యుపెన్సీ కనిపించినా.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పుంజుకోలేకపోయాయి.
ఇక పెళ్లి కాని ప్రసాద్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 50 లక్షల గ్రాస్, రెండో రోజు 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. దాంతో గత రెండు రోజుల్లో ఈ చిత్రం 55 లక్షల గ్రాస్, 25 లక్షలు నికరంగా కలెక్షన్లను సాధించింది. ఇక మూడో రోజు సండే ఏదైనా మ్యాజిక్ జరిగి కలెక్షన్లు పెరిగితే.. తప్పా ఈ సినిమా పరిస్థితి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌గా మారే అవకాశం లేదు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











