Pelli SandaD Day 1 Collection: పండగరోజు శ్రీకాంత్ తనయుడి సందడి.. నెగిటివ్ టాక్ వచ్చినా గట్టిగానే..

శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 25 ఏళ్ల క్రితం తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయింది. కీరవాణి మ్యూజిక్ ద్వారా అప్పట్లో ఆ సినిమాకు బాగా పబ్లిసిటీ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి భారీగా లాభాలను అందించింది. ఇక మళ్లీ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో కీరవాణి సంగీత సారథ్యంలో శ్రీకాంత్ తనయుడు నటించిన పెళ్లి సందD సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. పండుగ రోజు కాబట్టి కలెక్షన్స్ బాగానే వస్తాయని ఇతర సినిమాలకు పోటీగానే విడుదల చేశారు. శని ఆదివారం కూడా సెలవులు కాబట్టి ఇంకా కలిసొచ్చే అవకాశం అయితే ఉంది.

హైప్ క్రియేట్ చేసిన దర్శకేంద్రుడు

హైప్ క్రియేట్ చేసిన దర్శకేంద్రుడు

సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఈ సినిమాను కేవలం దర్శకత్వ పర్యవేక్షణ కాకుండా ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించే తనదైన శైలిలో హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం కూడా ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 పాటలతోనే పాజిటివ్ వైబ్రేషన్స్

పాటలతోనే పాజిటివ్ వైబ్రేషన్స్

పెళ్లి సందడి సినిమాను కె.రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహించగా ఆర్కే ఫిలిమ్స్ తో కలిసి ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో రోషన్ కు జోడిగా శ్రీలీలా నటించింది. వీరిద్దరికి సంబంధించిన టీజర్స్ సాంగ్స్ ఇదివరకే సినిమాకు కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లు ఇటీవల కె.రాఘవేంద్రరావు ప్రమోషన్ బాగానే చేశారు.

మొదటి రోజు కలెక్షన్స్

మొదటి రోజు కలెక్షన్స్

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 51 లక్షలు, సీడెడ్‌లో రూ. 34 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 17లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. మొత్తంగా రూ. 1.54 కోట్ల షేర్ రాగా.. 2.65 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టింది.

మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్

మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్

మొత్తంగా మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో రూ. 1.54 కోట్ల షేర్ రాబట్టిన పెళ్లి సందD కర్ణాటకలో అలాగే మిగతా రాష్ట్రాల్లో మొత్తం 5లక్షల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా 2 లక్షల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా పెళ్లి సందD 1.61కోట్ల షేర్ ను అందుకోగా.. 2.80కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

ప్రాఫిట్స్ లోకి రావాలంటే..

ప్రాఫిట్స్ లోకి రావాలంటే..

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు పెళ్లి సందD 1.61కోట్ల షేర్ ను అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 7కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల అయ్యింది. అంటే 7.5కోట్ల బ్రేక్ ఈవెన్ ను సాదించగలిగితినే లాభాల్లోకి వచ్చినట్లు లెక్క. పండగ రోజు సందడి బాగానే చేసిన పెళ్లి సందడి శని, ఆదివారం కూడా ఇదే తరహాలో కొనసాగితే చాలా తొందరగా ప్రాఫిట్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X