For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Pelli Sandadi క్లోజింగ్ కలెక్షన్స్.. శ్రీకాంత్ కొడుకు చితకొట్టేశాడుగా.. మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే?

  |

  టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ తనయుడు రోషన్ తొలిసారిగా నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్నేళ్ల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం కొంత విరామం తరువాత రోషన్ హీరోగా నటించిన సినిమా పెళ్లి సందడి. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా గౌరి రోనంకి దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అందరికీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ తరువాత సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో యూనిట్ ఆనంధాన్ని వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సినిమాలో రోషన్, శ్రీలీల జోడికి అందరి నుండి మంచి క్రేజ్ లభించడంతో పాటు కీలక పాత్ర చేసిన రాఘవేంద్ర రావు నటన పై కూడా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

   చిన్న సినిమాగా రిలీజ్ అయి

  చిన్న సినిమాగా రిలీజ్ అయి

  నిజానికి ఈ సినిమా కి విడుదల ముందు పెద్దగా హైప్ లేదనే చెప్పాలి. అయితే మూవీని ఆడియన్స్ కి మరింతగా చేరువ చేయడానికి యూనిట్ ముందు నుండే సినిమా యొక్క పబ్లిసిటీ పై గట్టిగా దృష్టిప పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే మూవీ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ తో రిలీజ్ చేయించారు. ట్రైలర్ ఆవిష్కరించిన మహేష్, యూనిట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు. ఆపైన సాంగ్స్ విషయంలో కూడా ప్రత్యేకంగా రాఘవేంద్ర రావు ఎంతో కేర్ తీసుకుని శ్రోతలను ఆకట్టుకునేలా ట్యూన్స్ తీసుకున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత మూవీ పై ఆడియన్స్ లో మంచి క్రేజ్ రావడం, ఆపైన రిలీజ్ తరువాత మెల్లగా సినిమా సక్సెస్ కావడం జరిగింది.

  ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ

  ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ

  నిజానికి ఈ సినిమాకి ఫస్ట్ డే మంచి టాక్ అయితే రాలేదు. సినిమాలో హీరో, హీరోయిన్స్ ఇద్దరి నటన బాగుందని, అలానే సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నపటికీ ఓవరాల్ గా అయితే మూవీ అంతగా ఆకట్టుకోదని కొందరు ఆడియన్స్ ఒకింత నిరాశక్తి వ్యక్తం చేసారు. అయితే రాను రాను మెల్లగా రోజుల గడిచిన కొద్దీ మూవీ టాక్ పుంజుకోవడంతో పాటు హీరో, హీరోయిన్స్ ఇద్దరి నటన, సాంగ్స్, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు వంటి వాటికీ అందరి నుండి బాగా రెస్పాన్స్ రాసాగింది. ఆపైన పుంజుకున్న ఈ సినిమా కొన్ని రోజుల తరువాత ఆడియన్స్ మనసు దోచుకుని ఫైనల్ గా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

  ఆకట్టుకున్న రోషన్, శ్రీలీల పెయిర్

  ఆకట్టుకున్న రోషన్, శ్రీలీల పెయిర్

  యువ నటుడు రోషన్, శ్రీలీల ఇద్దరూ కూడా పెళ్లిసందడి మూవీలో తమ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ మనసు దోచుకున్నారు. అప్పటికే నిర్మల కాన్వెంట్ తో ఎంట్రీ ఇచ్చిన రోషన్, ఈ సినిమాలో మరింతగా పరిణితి కలిగిన నటన కనబరిచాడు. ఇక శ్రీలీల కూడా తన యాక్టింగ్ తో పాటు డ్యాన్సింగ్ టాలెంట్ తో ముఖ్యంగా యువతని ఎంతో ఆకర్షించింది. మూవీ స్టోరీ కూడా అంతా ఊహించగలిన రొటీన్ ఫార్ములా దే అయినప్పటికీ అక్కడక్కడా కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, యాక్షన్,కామెడీ సీన్స్ వంటివి సినిమాకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ విధంగా ఈ ఇద్దరూ పెళ్లిసందడి సక్సెస్ కి ప్రధాన భూమిక పోషిస్తారు అనే చెప్పాలి.

  దర్శకేంద్రుడి మార్క్ సీన్స్

  దర్శకేంద్రుడి మార్క్ సీన్స్

  ఇక ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్, అలానే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, వంటి వాటితో పాటు ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ వంటివి రాఘవేంద్ర రావు మార్క్ సినిమాలని మనకి గుర్తు చేస్తాయి. అలానే సాంగ్స్ ని కూడా దర్శకురాలు గౌరీ తన గురువుని చాలా వరకు ఫాలో అయ్యారు. అక్కడక్కడా కొంత ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీన్స్ వంటివి వాటిని ఆయన స్టైల్ లోనే తీసి ఆడియన్స్ మనసు గెలుచుకున్న దర్శకురాలు గౌరీ రోనంకి కి అందరి నుండి మంచి పేరు దక్కింది.

   క్లోసింగ్ కలెక్షన్స్

  క్లోసింగ్ కలెక్షన్స్

  ఇక రొమాంటిక్ యాక్షన్ ఎంటెర్టైనెర్ పెళ్లి సందడి మూవీ టోటల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. నైజాం రూ. 2. 08 కోట్లు, సీడెడ్ రూ. 1. 55 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 1. 06 కోట్లు, ఈస్ట్ రూ. 0. 53 కోట్లు, వెస్ట్ రూ. 0. 40 కోట్లు, గుంటూరు రూ. 0. 64 కోట్లు, కృష్ణా రూ. 0. 45 కోట్లు, నెల్లూరు రూ. 0. 35 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్) రూ. 7. 06 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ రూ. 0. 60 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ రూ. 7. 66 కోట్లు.

  Recommended Video

  SSMB 28 : Mahesh Babu, Trivikram నుంచి 11 ఏళ్ల తర్వాత.. హీరోయిన్ ఆమెనా? || Filmibeat Telugu
  ప్రాఫిట్స్ ఎంతంటే

  ప్రాఫిట్స్ ఎంతంటే

  ఇక ఈ పెళ్లిసందడి మూవీ కి బ్రేక్ ఈవెన్ రూ. 5. 2 కోట్లు కాగా, దాదాపుగా మొదటి వారం పూర్తి అయ్యేసరికి దానిని రీచ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మొత్తం రూ. 7. 66 కోట్లు కలెక్ట్ చేసి బయ్యర్స్ కి రూ. 2. 46 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. అలానే ఇటీవల ఆంధ్రా లో విడుదలైన సినిమాల్లో బ్రేక్ ఈవెన్ ని అందుకుని మంచి లాభాలు తెచ్చిన సినిమా ఇదే అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.

  English summary
  Roshan Pelli SandaD Day closing Collection box office report,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X