PelliSandaD Day 10 collections: థియేటర్ల నెంబర్ పెరగడంతో భారీగా పెరిగిన వసూళ్లు.. మామూలుగా లేదుగా!

ఫ్యామిలీ హీరోగా అనేక సినిమాలు చేసిన శ్రీకాంత్ కుమారుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రోషన్‌. ఇప్పటికే నాగార్జునతో నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోషన్ పెళ్లి సందD సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. రాఘవేంద్రరావు ఎంట్రీతో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ఊహించని రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి. తొమ్మిది రోజులకే బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా పది రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీద మీరూ ఓ లుక్కేయండి మరి!

నాన్న సినిమా టైటిల్ తో

నాన్న సినిమా టైటిల్ తో

దర్శకేంద్రుకు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే టైటిల్‌లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన 'పెళ్లిసందD' సినిమా మీద కూడా రాఘవేంద్రరావు పుణ్యమా అని భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. అందుకే స్టార్ క్యాస్టింగ్ లేకున్నా ఈ సినిమాకు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.5 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు అంచనా.

రాఘవేంద్రరావు మార్క్

రాఘవేంద్రరావు మార్క్

రోషన్, శ్రీ లీలా జంటగా నటించిన 'పెళ్లి సందD'సినిమాను రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోణంకి తెరకెక్కించారు. రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించడంతో సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి.

నెగిటివ్ టాక్ తో

నెగిటివ్ టాక్ తో

దసరా సందర్భంగా అక్టోబర్ 15న కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లి సందD' సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు రివ్యూలు కూడా దారుణంగా రావడంతో ఇక ఈ సినిమా ఫ్లాప్ అవ్వచ్చని అనుకుంటే పండుగ సెలవులు కలిసి రావడంతో మంచి కలెక్షన్లను రాబతుదొంది.

 పది రోజులకు రోజు ఎంత వచ్చింది?

పది రోజులకు రోజు ఎంత వచ్చింది?

'పెళ్లి సందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు కలెక్షన్లు విషయానికి వస్తే నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ.8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ లక్ష, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ 3 లక్షలు కలెక్ట్ చేసి మొత్తం మీద పదో రోజు రూ.46 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ మాత్రమే కలెక్ట్ అయింది.

పది రోజులకు ఎంత వచ్చాయి?

పది రోజులకు ఎంత వచ్చాయి?

నెగెటివ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ.. పది రోజుల్లో నైజాంలో రూ. 1.88 కోట్లు, సీడెడ్‌లో రూ.1.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 92 లక్షలు, ఈస్ట్‌లో రూ. 46 లక్షలు, వెస్ట్‌లో రూ. 37 లక్షలు, గుంటూరులో రూ.58 లక్షలు, కృష్ణాలో రూ. 41 లక్షలు, నెల్లూరులో రూ. 31 లక్షలతో.. రూ. 6.32 కోట్లు షేర్, రూ. 10.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా పది రోజులకు

ప్రపంచవ్యాప్తంగా పది రోజులకు

తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లో రూ. 6.32 కోట్లు షేర్ రాబట్టిన 'పెళ్లి సందD' మూవీ.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 28 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు మేర వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ. 6.68 కోట్లు షేర్, రూ.11 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుంది. తొమ్మిదో రోజే బ్రేక్ ఈవెన్ చేసేసిన ఈ సినిమా 68 లక్షల లాభంతో ముందుకు వెళుతోంది.

Recommended Video

Pelli SandaD Movie Success Celebrations
 థియేటర్లు పెంచుకుని

థియేటర్లు పెంచుకుని

270 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండో వారంలో ఒక్క నైజాంలోనే సినిమా 174 థియేటర్స్ లో రన్ అవుతుండగా సీడెడ్ ఏరియాలో 80 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక ఆంద్రలో 170 వరకు థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తున్న ఈ సినిమా టోటల్ గా 2 వ వారం తెలుగు రాష్ట్రాలలో 425 థియేటర్స్ లో ఆడుతోంది. అంటే ఫస్ట్ వీక్ తో పోల్చితే రెండో వారం థియేటర్స్ తగ్గాల్సింది పోయి ఏకంగా 155 థియేటర్స్ ని పెంచుకుని మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X