Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
PelliSandaD Day 12 collections: లెక్క తప్పిన 'పెళ్లి సందD'.. 12 రోజుల లెక్కలివే!
హీరోగా అనేక సినిమాలు చేసిన శ్రీకాంత్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రోషన్ మేకా. టీనేజ్ లో ఉన్నపుడు నాగార్జునతో నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోషన్ పెళ్లి సందD సినిమాతో హీరోగా మారాడు. రాఘవేంద్రరావు మొట్టమొదటి సారి తెర మీద కనిపిస్తూ ఉండడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేయడంతో ఈ సినిమాకు ఊహించని రీతిలో కలెక్షన్లు వస్తున్నాయి. తొమ్మిది రోజులకు బ్రేక్ ఈవెన్ చేసిన సినిమా పన్నెండు పది రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీద మీరు ఓ లుక్కేయండి మరి!
భారీ అంచనాలు
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందD' సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు అదే టైటిల్లో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన 'పెళ్లిసందD' సినిమా మీద కూడా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ, గెస్ట్ రోల్ చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.
మంచి ప్రీ రిలీజ్
ఇక స్టార్ క్యాస్టింగ్ లేకున్నా ఈ సినిమాకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ముందే 5.5 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. రోషన్, శ్రీ లీలా జంటగా నటించిన 'పెళ్లి సందD' సినిమాను రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ రోణంకి తెరకెక్కించగా రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు.
నెగిటివ్ టాక్ తో
ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించడంతో సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి. అలా దసరా సందర్భంగా అక్టోబర్ 15న కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లి సందD' సినిమాకు ప్రేక్షకుల నుంచి ముందు నెగిటివ్ టాక్ వచ్చింది.
పన్నెండు రోజులకు ఎంత వచ్చాయి?
అయితే పండుగ సెలవులు కలిసి రావడంతో పాటు క్లీన్ ఎంటర్ టైనర్ కావడంతో సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. 12 వ రోజు 15 లక్షల నుండి 18 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా 13 లక్షల షేర్ ని అందుకుని కొంచెం అంచనాలను తప్పింది. ఇక పన్నెండు రోజుల్లో నైజాంలో రూ. 1.97 కోట్లు, సీడెడ్‌లో రూ.1.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 97 లక్షలు, ఈస్ట్‌లో రూ. 49 లక్షలు, వెస్ట్‌లో రూ. 40 లక్షలు, గుంటూరులో రూ.61 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో.. రూ. 6.66 కోట్లు షేర్, రూ. 10.88 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పన్నెండు రోజులకు
తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు రోజుల్లో రూ. 6.66 కోట్లు షేర్ రాబట్టిన 'పెళ్లి సందD' మూవీ.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 45 లక్షలు, ఓవర్సీస్లో రూ. 8 లక్షల మేర వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ. 7.19 కోట్లు షేర్, రూ.11.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుంది. తొమ్మిదో రోజే బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా కోటీ పంతొమ్మిది లక్షల లాభంతో ముందుకు వెళుతుంది.
Recommended Video
థియేటర్లు పెరిగినా నో యూజ్
270 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రెండో వారంలో ఒక్క నైజాంలో సినిమా 174 థియేటర్స్ లో రన్ అవుతుండగా సీడెడ్ ఏరియా మొత్తం మీద 80 కి పైగా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఇక ఆంధ్రా ప్రాంతంలో 170 థియేటర్స్ లో రెండో వారం విజయవంతంగా రన్ అవుతోంది. అలా ఈ సినిమా టోటల్ గా 2 వ వారం తెలుగు రాష్ట్రాల్లో 425 థియేటర్స్ లో సందడి చేస్తోంది. సాధారణంగా ఫస్ట్ వీక్ తో పోల్చితే రెండో వారం థియేటర్స్ తగ్గుతాయి కానీ ఈ సినిమా 155 థియేటర్స్ ని పెంచుకుని మంచి కలెక్షన్లు సాధించింది. వీక్ డేస్ కావడంతో కలెక్షన్లు బాగా తగ్గాయి.