PelliSandaD Day 2 collections: నెగెటివ్ టాక్ ఉన్నా షాకింగ్ కలెక్షన్లు.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు!
కోవిడ్ సెకెండ్ వేవ్ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, వాటిలో సూపర్ డూపర్ హిట్ అయిన మూవీలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో పాటు టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా కొన్ని చిత్రాలు మంచి టాక్ ఉన్నా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ దసరాకు పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన 'పెళ్లిసందD' ఒకటి. ఆరంభంలోనే నెగెటివ్ టాక్‌ను అందుకున్న ఈ మూవీకి రెండో రోజు భారీ కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి!

‘పెళ్లిసందD' చేసేందుకు వచ్చిన రోషన్
రోషన్.. శ్రీలీలా జంటగా నటించిన చిత్రం 'పెళ్లిసందD'. ఈ సినిమాను గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఈ చిత్రంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. దీన్ని ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం సమకూర్చారు.

అంచనాలు భారీగానే.. బిజినెస్ ఎంతంటే
రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఎవర్ గ్రీన్ చిత్రాల్లో 'పెళ్లి సందడి' ఒకటి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌లో వచ్చిన 'పెళ్లిసందD' మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

నెగెటివ్ టాక్.. రివ్యూలు అలాగే.. రెస్పాన్స్
ఎన్నో అంచనాల నడుమ దసరా రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లిసందD' మూవీకి ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, మొదటి రోజు సాయంత్రం ఆట నుంచి పుంజుకుంది. అది శనివారం కూడా కంటిన్యూ అయి భారీ రెస్పాన్స్ అందుకుంది.

రెండో రోజు ఎక్కడ.. ఎంత వచ్చిందంటే?
'పెళ్లిసందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు భారీ కలెక్షన్లే వచ్చాయి. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 42 లక్షలు, సీడెడ్‌లో రూ. 33 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 15 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రెండో రోజు రూ. 1.26 కోట్లు షేర్, రూ. 2.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

రెండు రోజులకూ కలిపి ఎంత వచ్చాయి?
మొదటి రోజు మాంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ రెండు రోజులకు కలిపి నైజాంలో రూ. 93 లక్షలు, సీడెడ్‌లో రూ. 67 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 32 లక్షలు, ఈస్ట్‌లో రూ. 17 లక్షలు, వెస్ట్‌లో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 16 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో.. రూ. 2.80 కోట్లు షేర్, రూ. 5.02ట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 2.80 కోట్లు షేర్ రాబట్టిన రోషన్ 'పెళ్లిసందD' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 2.93 కోట్లు షేర్, రూ. 5.28 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుని ఈ చిత్రం సత్తా చాటింది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి
పేరుకు చిన్న సినిమానే అయినా 'పెళ్లిసందD' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 5.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 2.93 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 3.07 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











