PelliSandaD కలెక్షన్లలో భారీ డ్రాప్.. నాలుగో రోజు భారీ దెబ్బ.. బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత సాధించాలి అంటే?

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడు ఏ సినిమాను ఎలా ఆదరిస్తారో ఎవరూ అంచనా వేయలేరు. ఆ విషయాన్ని దసరా సందర్భంగా విడుదల అయిన 'పెళ్లిసందD' సినిమా ప్రూవ్ చేసింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లిసందD' సినిమాకు నాలుగు రోజుల పాటు వచ్చిన కలెక్షన్లు ఎలా ఉన్నాయి అనే విషయం పరిశీలిస్తే

 ఏకాంగా మూడు రావడంతో

ఏకాంగా మూడు రావడంతో

ఈ ఏడాది దసరా సందర్భంగా మూడు సినిమాలు విడుదల అయ్యాయి. ముందుగా 14వ తారీకు సిద్ధార్థ, శర్వానంద్ హీరోలుగా రూపొందిన మహాసముద్రం సినిమా విడుదల కాగా 15వ తేదీన అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, తర్వాత రోషన్ హీరోగా రూపొందిన 'పెళ్లి సందD' సినిమా కూడా విడుదలైంది. తెలుగమ్మాయి శ్రీ లీల జంటగా నటించిన 'పెళ్లిసందD' సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆమె శిష్యురాలు గౌరీ రోణంకి ఈ సినిమాను తెరకెక్కించారు.

దర్శకేంద్రుడి నటన

దర్శకేంద్రుడి నటన

ఈ సినిమాలో మొట్టమొదటి సారిగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం సమకూర్చిన ఈ సినిమా దసరా సందర్భంగా 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు 5.5 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

టాక్ కి ధీటుగా

టాక్ కి ధీటుగా

దసరా రోజున అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లి సందD' సినిమాకు మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి నెగిటివ్ మౌత్ టాక్ తో పాటు రివ్యూలు కూడా తేడాగానే వచ్చాయి. ఈ దెబ్బతో సినిమా పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ, మొదటి రోజు సాయంత్రం నుంచి సినిమా పుంజుకుని శనివారం కూడా మంచి కలెక్షన్లు కూడా సాధించింది. 'పెళ్లి సందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి.

నాలుగో రోజు కలెక్షన్లు

నాలుగో రోజు కలెక్షన్లు

ఇక నాలుగో రోజు కూడా భారీ కలెక్షను రాబట్టింది ఈ సినిమా. నైజాం రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3.2 లక్షలు, గుంటూరు రూ 4.4 లక్షలు, కృష్ణాలో రూ.3 లక్షలు, నెల్లూరు రూ. 3 లక్షలతో.. నాలుగో రోజు రూ.51 కోట్లు షేర్, రూ. 0.82 కోట్ల గ్రాస్ వచ్చింది.

 నాలుగు రోజులకు కలిపి

నాలుగు రోజులకు కలిపి

మొదటి రోజు కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ నాలుగు రోజులకు కలిపి నైజాంలో 1.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 98 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 56 లక్షలు, ఈస్ట్‌లో రూ. 28 లక్షలు, వెస్ట్‌లో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 4.36 కోట్లు షేర్, రూ.7.47 ట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత సాధించాలి అంటే?

బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత సాధించాలి అంటే?

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో రూ.3.85 కోట్లు షేర్ రాబట్టిన 'పెళ్లిసందD' మూవీ.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 6 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 4.59 కోట్ల షేర్, రూ. 7.90 కోట్లు గ్రాస్‌ను రాబట్టి నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచింది. సినిమా బిజినెస్ 5.5 కోట్లుగా నిలవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదయింది. మరో 1.41 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్‌‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X