PelliSandaD 5Days collections: చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్లు.. అన్ని లక్షలు వస్తే హిట్ అయినట్లే

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే సూపర్ డూపర్ హిట్ అవగా.. మిగిలినవన్నీ నిరాశనే ఎదుర్కొన్నాయి. అందులోనూ కొన్ని సినిమాలు ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో పాటు టికెట్ రేట్ల ఇష్యూ కారణంగా.. మంచి టాక్ ఉన్నా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ దసరాకు పలు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించిన 'పెళ్లిసందD' ఒకటి. నెగెటివ్ టాక్‌ను అందుకున్న ఈ మూవీకి కలెక్షన్లు మాత్రం మంచిగానే వచ్చాయి. అసలు ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయో చూద్దాం పదండి!

‘పెళ్లిసందD’ అంటూ వచ్చిన రోషన్

‘పెళ్లిసందD’ అంటూ వచ్చిన రోషన్

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీలీలా హీరోయిన్‌గా చేసిన చిత్రం 'పెళ్లిసందD'. దీన్ని గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. దీన్ని ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించారు.

అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎవర్ గ్రీన్ చిత్రాల్లో 'పెళ్లి సందడి' ఒకటి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌లో వచ్చిన 'పెళ్లిసందD' మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

తక్కువ అంచనాల నడుమ దసరా రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లిసందD' మూవీకి ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, తొలి రోజు సాయంత్రం ఆట నుంచి పుంజుకుంది. ఇలా వీకెండ్‌లో భారీగా.. ఆ తర్వాత మోస్తరుగా రెస్పాన్స్ అందుకుంది.

ఐదో రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

ఐదో రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

'పెళ్లిసందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఐదో రోజు కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. ఐదో రోజు రూ. 43 లక్షలు షేర్, రూ. 63 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

ఐదు రోజులకూ కలిపి ఎంతొచ్చాయి?

ఐదు రోజులకూ కలిపి ఎంతొచ్చాయి?

మొదట్లో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ.. ఐదు రోజులకు కలిపి నైజాంలో రూ. 1.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్‌లో రూ. 32 లక్షలు, వెస్ట్‌లో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 45 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో.. రూ. 4.79 కోట్లు షేర్, రూ. 8 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో రూ. 4.79 కోట్లు షేర్ రాబట్టిన రోషన్ 'పెళ్లిసందD' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 18 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 6 లక్షలు వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ. 5.03 కోట్లు షేర్, రూ. 8.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుని హిట్ దిశగా సాగుతోంది.

Recommended Video

Pelli SandaD Movie Success Celebrations
బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

చిన్న సినిమానే అయినా 'పెళ్లిసందD' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 5.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఐదు రోజుల్లో రూ. 5.03 కోట్లు వసూలు చేసింది. దీంతో మరో రూ. 97 లక్షలు వసూలు చేస్తే క్లీన్ హిట్‌‌ స్టేటస్ అందుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X