PelliSandaD 6Days collections: 6 కోట్ల టార్గెట్.. 6 రోజుల్లోనే అన్ని కోట్లు.. ఇంకెంత రాబట్టాలంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే మంచి ఆరంభాలను అందుకుని గ్రాండ్ ఎంట్రీని అందుకున్నారు. ఇలా ఇటీవలే టాలీవుడ్‌లో మరో వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. అతడే.. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్. ఆ మధ్య 'నిర్మలా కన్వేంట్' అనే సినిమాలో నటించినా.. 'పెళ్లిసందD' అనే చిత్రంతో హీరోగా ఇప్పుడే లాంచ్ అయ్యాడు. ఇందులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక పాత్రను చేశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు ఊహించని విధంగా వస్తున్నాయి. మరి ఈ సినిమా ఆరు రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి మరి!

‘పెళ్లిసందD' చేయాలని రోషన్ రాక

‘పెళ్లిసందD' చేయాలని రోషన్ రాక

రోషన్, శ్రీలీలా హీరో హీరోయిన్‌గా చేసిన చిత్రం 'పెళ్లిసందD'. ఈ మూవీని గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. దీన్ని ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం సమకూర్చారు.

అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

అప్పట్లో శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌లో వచ్చిన 'పెళ్లిసందD' మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అవి మరింతగా ఎక్కువయ్యాయి. అందుకే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.60 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

దసరా రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లిసందD' మూవీకి ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా నెగ్గుకు రావడం కష్టమేనన్న టాక్ కూడా వినిపించింది. కానీ, తొలి రోజు సాయంత్రం ఆట నుంచి పుంజుకుంది. ఇలా వీకెండ్‌లో భారీగా.. ఆ తర్వాత మోస్తరుగా రెస్పాన్స్‌తో పాటు కలెక్షన్లను రాబడుతోంది.

ఆరో రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

ఆరో రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

'పెళ్లిసందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఆరో రోజు రూ. 30 లక్షలు షేర్, రూ. 48 లక్షలు గ్రాస్ మాత్రమే కలెక్ట్ అయింది.

 ఆరు రోజులకూ కలిపి ఎంతొచ్చాయి?

ఆరు రోజులకూ కలిపి ఎంతొచ్చాయి?

నెగెటివ్ టాక్‌తో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ.. ఆరు రోజులకు కలిపి నైజాంలో రూ. 1.59 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 67 లక్షలు, ఈస్ట్‌లో రూ. 35 లక్షలు, వెస్ట్‌లో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 25 లక్షలతో.. రూ. 5.09 కోట్లు షేర్, రూ. 8.48 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో రూ. 5.09 కోట్లు షేర్ రాబట్టిన 'పెళ్లిసందD' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 6 లక్షలు మేర వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ. 5.35 కోట్లు షేర్, రూ. 9.02 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుని హిట్ దిశగా పయనిస్తోంది.

Recommended Video

Pelli SandaD Movie Success Celebrations
 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

కొత్త హీరోనే అయినా 'పెళ్లిసందD' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 6.60 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లో రూ. 5.35 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 65 లక్షలు వసూలు చేస్తేనే క్లీన్ హిట్‌‌‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X