PelliSandaD Day 8 collections: హిట్ స్టేటస్ కు కేవలం లక్షల దూరం.. దుమ్ముదులుపుతున్న పెళ్లిసందడి
ఫ్యామిలీ హీరోగా అనేక సినిమాలు చేసిన శ్రీకాంత్.. తన కొడుకు రోషన్‌ను కూడా ఇప్పటికే టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోషన్ పెళ్లి సందD సినిమాతో పూర్తి స్థాయి హీరోగా నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు ఊహించని విధంగా వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీద మీరూ ఓ లుక్కేయండి మరి!

అదే టైటిల్ తో
రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌లో శ్రీకాంత్ కొడుకు హీరోగా వచ్చిన వచ్చిన 'పెళ్లిసందD' మూవీ పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అవి మరింతగా ఎక్కువయ్యాయి. అందుకే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.5 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు అంచనా

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో
రోషన్, శ్రీ లీలా జంటగా నటించిన 'పెళ్లి సందD' సినిమాను గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. 'పెళ్లి సందD' అంటూ వచ్చిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించారు.

నెగిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లు
దసరా సందర్భంగా అక్టోబర్ 15న కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లి సందD' మూవీకి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ మౌత్ టాక్ బయటకు వచ్చింది. అలాగే దీనికి తోడు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా ఇబ్బంది పడవచ్చని అనుకుంటూ ఉండగా అనూహ్యంగా పండుగ సెలవులు కలిసి రావడంతో మంచి కలెక్షన్లను సంపాదిస్తోంది.

ఎనిమిదో రోజు ఎంత వచ్చింది?
'పెళ్లి సందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు కలెక్షన్లు తగ్గాయి. దానికి ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2.4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ లక్ష, గుంటూరులో రూ. 1.6 లక్షలు, కృష్ణాలో రూ. 1.60 లక్షలు, నెల్లూరులో రూ 80 వేలు కలెక్ట్ చేసి మొత్తం మీద ఎనిమిదో రోజు రూ. 19 లక్షలు షేర్, రూ. 32 లక్షలు గ్రాస్ మాత్రమే కలెక్ట్ అయింది.

ఎనిమిది రోజులకు ఎంత వచ్చాయి?
నెగెటివ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ.. ఎనిమిది రోజుల్లో నైజాంలో రూ. 1.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 76 లక్షలు, ఈస్ట్‌లో రూ. 39 లక్షలు, వెస్ట్‌లో రూ. 32 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో.. రూ. 5.55 కోట్లు షేర్, రూ. 9.12 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది రోజులకు
తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజుల్లో రూ. 5.55 కోట్లు షేర్ రాబట్టిన 'పెళ్లి సందD' మూవీ.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 23 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 7 లక్షలు మేర వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్లు షేర్, రూ. 9.40 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుని విజయం దిశగా సాగుతోంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఇంకెంత రావాలి?
'పెళ్లి సందD' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 5.5 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఎనిమిది రోజుల్లో రూ. 5.65 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 15 లక్షలు వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. అది పెద్ద విషయం కాదనే చెప్పాలి . చూడాలి ఏమవుతుంది అనేది.


Click it and Unblock the Notifications











