PelliSandaD 9 Days collections: భారీగా పెరిగిన వసూళ్లు.. 9 రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్

చాలా కాలంగా తెలుగు పరిశ్రమకు చెందిన స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది కుర్రాళ్లు తెరంగేట్రం చేశారు. అయితే, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే గ్రాండ్ ఎంట్రీని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్.. తన కొడుకు రోషన్‌ను కూడా ఇప్పటికే టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇక, అతడు హీరోగా నటించిన చిత్రమే 'పెళ్లిసందD'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు ఊహించని విధంగా వస్తున్నాయి. మరి ఈ సినిమా తొమ్మిది రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి మరి!

‘పెళ్లిసందD' అని వచ్చిన రోషన్

‘పెళ్లిసందD' అని వచ్చిన రోషన్


రోషన్ హీరోగా శ్రీలీలా హీరోయిన్‌గా నటించిన చిత్రం 'పెళ్లిసందD'. ఈ మూవీని గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. దీన్ని ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం ఇచ్చారు.

అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌లో వచ్చిన 'పెళ్లిసందD' మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అవి మరింతగా ఎక్కువయ్యాయి. అందుకే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.90 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు టాలీవుడ్‌లోని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లిసందD' మూవీకి ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా నెగ్గుకు రావడం కష్టమేనన్న టాక్ కూడా వినిపించింది. కానీ, ఆ వెంటనే ఈ చిత్రం బాగా పుంజుకుంది. ఇలా వీకెండ్‌లో భారీగా.. ఆ తర్వాత మోస్తరుగా కలెక్షన్లు సాధిస్తూ హిట్ దిశగా పయనించింది.

9వ రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

9వ రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

'పెళ్లిసందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2.30 లక్షలు, కృష్ణాలో రూ. 2.60 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. 9వ రోజు రూ. 30 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

9 రోజులకూ కలిపి ఎంత వచ్చాయి?

9 రోజులకూ కలిపి ఎంత వచ్చాయి?

నెగెటివ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ.. 9 రోజుల్లో నైజాంలో రూ. 1.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 80 లక్షలు, ఈస్ట్‌లో రూ. 42 లక్షలు, వెస్ట్‌లో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో.. రూ. 5.85 కోట్లు షేర్, రూ. 9.60 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది రోజుల్లో రూ. 5.85 కోట్లు షేర్ రాబట్టిన 'పెళ్లిసందD' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 25 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు మేర వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 6.18 కోట్లు షేర్, రూ. 10.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుని విజయం సాధించిందీ చిత్రం.

Recommended Video

Pelli SandaD Movie Success Celebrations
బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

చిన్న హీరోనే అయినా 'పెళ్లిసందD' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 5.50 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 6 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా తొమ్మిది రోజుల్లో రూ. 6.18 కోట్లు వసూలు చేసింది. అంటే హిట్ అవడంతో పాటు రూ. 18 లక్షలు లాభాలను అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X