»   » భారీ నష్టాల్లో ‘బాహుబలి’....సినిమా ఎత్తేసే ఆలోచనలో నిర్మాతలు!

భారీ నష్టాల్లో ‘బాహుబలి’....సినిమా ఎత్తేసే ఆలోచనలో నిర్మాతలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-ది బిగినింగ్' మూవీ 2015లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా విడుదలైన అన్ని చోట్లా కలెక్షన్ల వర్షం కురిసింది.

ఏప్రిల్ 28న బాహుబలి సెకండ్ పార్ట్ 'బాహుబలి-ది కంక్లూజన్' రిలీజ్ కాబోతోంది. తొలి పార్టులో ప్రశ్నార్థకంగా మిగిలిన ఎన్నో విషయాలను పార్ట్ 2 సమాధానం దొరకబోతోంది. ముఖ్యంగా దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికి సమాధానం ఈ సినిమాలో ఉండబోతోంది.

రీ రిలీజ్ ప్లాప్

రీ రిలీజ్ ప్లాప్

సెకండ్ పార్ట్ రిలీజ్ కొన్ని రోజులు ఉందనగా...... ఫస్ట్ పార్ట్ ను ఉత్తరాదిన దాదాపు 1000 థియేటర్లలో రీ రిలీజ్ చేసారు. 'బాహుబలి-1' చూసినవారికి 'బాహుబలి-2' టికెట్లు వచ్చేలా ఆఫర్ కూడా ప్రకటించారు. అయితే రి రిలీజ్ పెద్ద ప్లాప్ అయింది. ప్రేక్షకులు రాక థియేటర్స్ అన్నీ వెలవెలబోతున్నాయి.

ఆసక్తి చూపని ప్రేక్షకులు

ఆసక్తి చూపని ప్రేక్షకులు

బాహుబలి పార్ట్ 1 ఇప్పటికే అనేకసార్లు టీవీలో రావడం, ఆన్ లైన్లో కూడా అందుబాటులో ఉండటం, ఇప్పటికే సినిమా డివీడీల రూపంలో కూడా రావడంతో ఎవరూ మళ్లీ భారీగా డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.

సినిమా ఎత్తేసే ఆలోచన

సినిమా ఎత్తేసే ఆలోచన

సినిమాకు పెద్దగా స్పందన లేక పోవడంతో సినిమాను ఎత్తేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. రీ రిలీజ్ వల్ల థియేటర్స్ రెంటు, ఇతర ఖర్చుల రూపంలో భారీగానే నష్టం వచ్చినట్లు సమాచారం.

పార్ట్ 2 రిలీజ్

పార్ట్ 2 రిలీజ్

ఏప్రిల్ 28న బాహుబలి పార్ట్ 2- ది కంక్లూజన్ రిలీజ్ చేయబోతున్నారు. అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రాన్ని 6500 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రూ. 1000 వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

English summary
People not interested on Baahubali-the beginning re-release. Baahubali: The Beginning is a 2015 Indian epic fantasy film directed by S. S. Rajamouli. Produced by Shobu Yarlagadda and Prasad Devineni, the first of two cinematic parts simultaneously shot in Telugu and Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu