యూఎస్ఏ బాక్సాఫీస్ రేసులో కింగ్ ఎవరంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి బాక్సాఫీసు వద్ద తన స్టార్ పవర్ నిరూపించారు. ఆయన నటించిన 'పేట' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద తమిళ చిత్రాల కేటగిరీల్లో థర్డ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు 2.0, కబాలి చిత్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా... మూడో స్థానం కూడా రజనీకాంత్ నటించిన 'పేట' దక్కించుకోవడం గమనార్హం.

'పేట' చిత్రం జనవరి 9న తెలుగు, తమిళంలో కలిపి యూఎస్ఏలో 260 లొకేషన్లలో విడుదలైంది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో తొలి రోజే $562,057 వసూలు చేసింది. ప్రీమియర్ షోలతో కలిపి ఫస్ట్ వీకెండ్ (5 డేస్) $1,934,484 రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.

మూడో వారంలోనూ ‘పేట' సత్తా

మూడో వారంలోనూ ‘పేట' సత్తా

జనవరిలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి మూడో వారంలోనూ స్ట్రాంగ్‌గా వసూళ్లు రాబట్టడం విశేషం. బాక్సాఫీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘పేట' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద లైఫ్ టైమ్ $2,552,950 వసూలు చేసింది.

యూఎస్ఏ బాక్సాఫీస్ రేసులో కింగ్ రజనీకాంత్

యూఎస్ఏ బాక్సాఫీస్ రేసులో కింగ్ రజనీకాంత్

రజనీ యూఎస్ఏ టాప్ 5 గ్రాసర్స్(తమిళం) వివరాల్లోకి వెళితే... 2.0 మూవీ మూడు భాషల్లో విడుదలై $5,509,317 వసూలు చేసి నెం.1 స్థానంలో ఉంది. కబాలి చిత్రం $4,585,808 వసూళ్లతో 2వ స్థానంలో, పేట $2,552,950తో మూడో స్థానంలో, యంతిరన్ $2,021,465 వసూళ్లతో 4వ స్థానంలో, కాలా $1,913,110 వసూళ్లతో 5వ స్థానంలో ఉంది.

50 డేస్ సెలబ్రేషన్స్

50 డేస్ సెలబ్రేషన్స్

‘పేట' మార్చి1తో 50 డేస్ పూర్తి చేసుకున్నసందర్భంగా రజనీకాంత్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, చిత్ర బృందం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించింది. తమిళనాడులోని పలు థియేటర్లలో ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది.

పేట

పేట

సన్ పిక్చర్స్ నిర్మించి ఈ మూవీలో రజనీకాంత్ సరసన త్రిష, సిమ్రన్ హీరో హీరోయిన్లుగా నటించారు. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ద్వారా రజనీకాంత్ 2019లో తొలి విజయం అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X