twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పేట’ ఫస్ట్ వీక్ రూ. 150 కోట్ల దిశగా... ఆ ప్రచారం నమ్మవద్దంటున్న నిర్మాతలు!

    |

    రజనీకాంత్ సినిమాలు వెంట వెంటనే రిలీజ్ అవ్వడం చూసి చాలా కాలమైంది. 2.0 సినిమా విడుదలైన కొన్ని రోజుల గ్యాప్‌తో సూపర్ స్టార్ 'పేట' అభిమానుల్లో సంక్రాంతి సంబరాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అదరగొడుతోంది.

    తమిళనాడు బాక్సాఫీసు వద్ద అజిత్ చిత్రం 'విశ్వాసం'తో పోటీ పడుతూ 'పేట' జనవరి 10న విడుదలైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మూవీ జనవరి 15 నాటికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 128 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    ఫస్ట్ వీక్ రూ. 150 కోట్లు...

    ఫస్ట్ వీక్ రూ. 150 కోట్లు...

    జనవరి 16తో ‘పేట' చిత్రం బక్సాఫీసు వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకోనుంది. నేటితో ఈ చిత్రం వసూళ్లు రూ. 150 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలు వేస్తున్న ట్రేడ్ విశ్లేషకులు.

    <strong>ఫ్యాన్ ఫైట్: ఫేక్ కలెక్షన్స్ నమ్మొద్దు అంటూ నిర్మాతల ప్రకటన!</strong>ఫ్యాన్ ఫైట్: ఫేక్ కలెక్షన్స్ నమ్మొద్దు అంటూ నిర్మాతల ప్రకటన!

    తమిళనాడులో ‘విశ్వాసం' పై చేయి

    తమిళనాడులో ‘విశ్వాసం' పై చేయి

    అయితే తమిళనాడు బాక్సాఫీసు వద్ద అజిత్ నటించిన ‘విశ్వాసం' మూవీ పైచేయి సాధించిందని, ‘పేట' కంటే ఎక్కువ వళ్లు సాధిస్తూ అజిత్ మూవీ దూసుకెళుతోందని అంటున్నారు. అయితే రెండు చిత్రాల నిర్మాతలు అఫీషియల్‌గా కలెక్షన్లు ప్రకటించలేదు.

    ‘పేట' నిర్మాతలు ఏమంటున్నారు?

    ‘పేట' నిర్మాతలు ఏమంటున్నారు?

    అయితే తమిళనాడులో ‘పేట' వెనకబడిందనే వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్' స్పందించింది. సినిమా ఇక్కడ 600పైగా థియేటర్లలో విడుదలైంది. మాకే ఇంకా పూర్తి వివరాలు అందలేదు... కొందరు ట్రేడ్ ట్రాకర్స్ కలెక్షన్ల డాటా ఎలా సంపాదిస్తున్నారో అర్థం కావడం లేదు. అభిమానులారా... మీరు ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు, ఇద్దరు హీరోల సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి అని ట్వీట్ చేసింది.

    ఓవర్సీస్ మార్కెట్లో ‘పేట' ఆధిపత్యం

    ఓవర్సీస్ మార్కెట్లో ‘పేట' ఆధిపత్యం

    అయితే ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం రజనీకాంత్ మూవీ ‘పేట' ఆధిప్యతం కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ‘పేట' ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న ‘థింక్ బిగ్' డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రం 14 కోట్లు(2 మిలియన్ డాలర్) క్రాస్ అయినట్లు అఫీషియల్‌గా వెల్లడించింది.

    ఇతర రాష్ట్రాల్లో...

    ఇతర రాష్ట్రాల్లో...

    ‘పేట' చిత్రం కర్నాటకలో మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే తెలుగులో తీవ్రమైన పోటీ వల్ల థియేటర్లు తక్కువ లభించడంతో నెంబర్స్ తక్కువగా ఉన్నాయి. అయితే విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్లు రాబడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది.

    English summary
    Rajinikanth 'Petta' facing heavy competition at the box office due to Ajith's Viswasam, which released on the same day (January 10) as Petta. It is said that Petta has minted Rs 128 crore worldwide, as of January 15 and is marching towards the Rs 150-crore mark.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X