బాక్సాఫీస్ మాయ... 2 సినిమాలు.. 200 కోట్లు.. రజనీ, అజిత్ కలెక్షన్ల వార్

సంక్రాంతి బరిలో దూకిన తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, అజిత్ కుమార్ బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టిస్తున్నారు. పేటా, విశ్వాసం చిత్రాలపై సినీ విమర్శకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినప్పటికీ ఈ రెండు చిత్రాలు వసూళ్ల పరంగా హల్‌చల్ చేస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెట్టడంపై ట్రేడ్ అనలిస్టులు, డిస్టిబ్యూటర్లు విశేషంగా పేర్కొంటున్నారు. పేటా, విశ్వాసం చిత్రాల కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి...

8 రోజుల్లో రూ.100 కోట్లు

8 రోజుల్లో రూ.100 కోట్లు

ఇక పండుగ సందర్భంగా రిలీజైన అజిత్ కుమార్ చిత్రం విశ్వాసం వసూళ్ల హవాను కొనసాగిస్తున్నది. కేవలం 8 రోజుల్లోనే ఈ చిత్రం రూ.125 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ వారంలో విశ్వాసం రూ.200 కోట్ల మైలురాయిని చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

యూఎస్‌లో కలెక్షన్లు

యూఎస్‌లో కలెక్షన్లు

అమెరికాలో తెలుగు చిత్రాలను మించిన వసూళ్లను విశ్వాసం కలెక్ట్ చేస్తున్నది. జనవరి 16న యూఎస్ బాక్సాఫీస్ వద్ద విశ్వాసం 5,735 డాలర్లు, ఎన్టీఆర్ కథానాయకుడు 4442 డాలర్లు, వినయ విధేయ రామ 1131 డాలర్లు వసూలు చేయడాన్ని బట్టి విశ్వాసంపై ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతున్నది అని ట్రేడ్ అనలిస్టు రమేష్ బాలా ట్వీట్ చేశారు.

కర్ణాటకలో విశ్వాసం వసూళ్లు

కర్ణాటకలో విశ్వాసం వసూళ్లు

కర్ణాటకలో కూడా విశ్వాసం చిత్రం బ్రహ్మండమైన వసూళ్లను రాబడతున్నది. ఈ చిత్రం తొలివారంలో రూ.7.30 కోట్ల వసూళ్లను సాధించింది. రెండో వారంలో కూడా ఈ మూవీ మరిన్నీ వసూళ్లను సాధిస్తుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

తమిళనాడులో రజనీకాంత్ రికార్డు

తమిళనాడులో రజనీకాంత్ రికార్డు

తమిళనాడులో కేవలం 11 రోజుల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన తొలి తమిళచిత్రంగా పేటా ఓ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పేట వసూళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏకంగా సన్ పిక్చర్స్, ప్రముఖ డిస్టిబ్యూటర్లు రంగంలోకి దిగి కలెక్షన్లను ప్రకటించారు.

ఓవర్సీస్‌లో ఘనంగా వసూళ్లు

ఓవర్సీస్‌లో ఘనంగా వసూళ్లు

ఓవర్సీస్‌లో కూడా పేటా చిత్రం వసూళ్లను భారీగా రాబడుతున్నది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.65 కోట్లు వసూలు చేసింది. రిలీజైన చోట పేటాకు మంచి రెస్పాన్స్ వస్తుందని డిస్టిబ్యూటర్లు పేర్కొంటున్నారు.

రూ.200 కోట్లు దిశగా

రూ.200 కోట్లు దిశగా

పేటా చిత్రం రెండో వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శశికుమార్, త్రిషా తదితరులు నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X