Phalana Abbayi Phalana Ammayi day1 collections నాగశౌర్యకు హిట్టు కొట్టాడా? తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ నటుడు నాగశౌర్య హీరోగా నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మార్చి 17న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సినిమా కథ ఏమిటంటే?
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా విషయానికి వస్తే.. ప్రేమికులుగా మారిన ఇద్దరు స్నేహితుల జీవితాల్లో 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు వరకు జరిగిన మానసిక సంఘర్షణ, భావోద్వేగాల నేపథ్యంగా కథ సాగుతుంది. స్నేహితులుగా, ప్రేమికులుగా నాగశౌర్య, మాళవిక నాయర్ నటించారు. ఈ సినిమా తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను కూడగట్టుకొన్నది.

బడ్జెట్ ఎంతంటే?
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా యూకే బ్యాక్ డ్రాప్‌గా సాగుతుంది. ఈ సినిమాను దాదాపు లండన్‌లో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 8 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ప్రీరిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందంటే?
ఇక ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. భారీగానే జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 3.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 4 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంది. అయితే ఈ చిత్రం శాటిలైట్ హక్కులు భారీ రేట్‌కు అమ్ముడుపోవడంతో దాదాపు లాభాలకు దగ్గర్లో ఈ చిత్రం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

థియేటర్ కౌంట్, ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే?
అలాగే ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీగా థియేటర్లలో రిలీజ్ చేశారు. దాదాపు 400 థియేటర్లలో రిలీజ్ చేసినట్టు డేటా వెల్లడిస్తున్నది. అమెరికాలో కూడా ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్లలోనే విడుదల చేయడం తెలిసిందే. ఈ సినిమాకు తొలి రోజు దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైందనేది సమాచారం.

తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియాలో ఈ చిత్రం 1 కోటి రూపాయలు తొలి రోజున నమోదు చేసింది. అమెరికాలో ఈ చిత్రం 20 లక్షలకుపైగా కలెక్షన్లు రాబట్టింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1.2 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే గట్టిగానే బాక్సాఫీస్ వద్ద నిలబడాల్సిన అవసరం ఉంది.


Click it and Unblock the Notifications











