PAPA day 2 collections నాగశౌర్య మూవీపై అలాంటి దెబ్బ.. రెండో రోజు వసూళ్లు ఎంతంటే?
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడానికి తడబాటు పడుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా రెండో రోజు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టారనే విషయంలోకి వెళితే..

8 కోట్ల బడ్జెట్‌తో పాప
ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి సినిమాను సుమారు 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బిజినెస్‌ను 3.5 కోట్లుగా అంచనా వేశారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం 4 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంది. ఈ చిత్రం దాదాపు 4 కోట్ల షేర్ లక్ష్యంతో బరిలోకి దిగింది.

తొలి రోజు ఎన్ని కోట్లంటే?
ఇక తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 20 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు 1.20 కోట్లకుపైగానే వసూళ్లను నమోదు చేసింది.

రెండో రోజు ఫలానా అబ్బాయి ఆక్యుపెన్సీ
ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఈ సినిమాపై తుఫాను ప్రభావం భారీగానే చూపింది. అదికాకుండా మిక్స్‌డ్ రెస్సాన్స్ కూడగట్టుకోవడం కూడా ఓ కారణమైంది. ఈ రెండు కారణాల వల్ల ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి చిత్రం యావరేజ్‌గా 35 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నది.

ఫలానా అబ్బాయి రెండో రోజు వసూళ్లు
ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి సినిమా 2వ రోజు ఓ మోస్తారుగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 60 లక్షల రూపాయలకుపైగా షేర్ సాధించింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 15 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండో రోజు 75 లక్షలు రాబట్టింది.

ఫలానా అబ్బాయి లాభాల్లోకి రావాలంటే?
ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి గత రెండు రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 1.20 కోట్లు, రెండో రోజు 75 లక్షలు సాధించడంతో ఈ సినిమా రెండు రోజుల్లో 2 కోట్ల రూపాయల వసూళ్లకు చేరువైంది. ఇంకా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. భారీగానే వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











