Salaar: ప్రభాస్ మూవీకి కళ్లు చెదిరే డీల్.. ఏకంగా అన్ని కోట్లతో సంచలన రికార్డు

దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటి.. 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి మొత్తం భారీ చిత్రాల్లో మాత్రమే నటిస్తోన్న ఈ టాల్ హీరో.. అన్ని ఇండస్ట్రీల్లో తన మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు. ఇలా ఇప్పుడు అతడు ఏకంగా నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్‌తో ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

భారీ బడ్జెట్‌తో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'సలార్' మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ను గత ఏడాది ప్రారంభంలోనే మొదలెట్టారు. ఆ వెంటనే కొన్ని షెడ్యూళ్లను తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తి చేశారు. ఆ తర్వాత గుజరాత్ సహా కొన్ని వేరే రాష్ట్రాల్లో భారీ బడ్జెట్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక, ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఫారెన్‌లో శరవేగంగా సాగుతోంది. ఇలా మరో రెండు వారాల్లోనే దీనికి సంబంధించిన టాకీ పార్టు మొత్తాన్ని పూర్తి చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ బిజినెస్ గురించి ఓ న్యూస్ లీక్ అయింది.

Phars Film bagged Prabhas Salaar Movie Overseas Rights

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీకి సంబంధించిన బిజినెస్ కూడా ఒక్కొక్కటిగా పూర్తి అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ హక్కులను ఫార్స్ ఫిలిమ్స్ కో ఎల్ఎల్‌సీ అనే సంస్థ సొంతం చేసుకుందట. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ సంస్థ అత్యధిక ధరకు కొనుగోలు చేసిన చిత్రాల్లో 'సలార్' టాప్ ప్లేస్‌లో నిలిచిందని తెలిసింది. అలాగే, ఇది ప్రభాస్ కెరీర్‌లోనే టాప్ డీల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.

'సలార్' మూవీని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X