మెగా ఎఫెక్ట్: ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఓపెనింగ్స్
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి మెగా మేనల్లుడిగా వెండి తెరకు కొత్తగా పరిచయమైన సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా ‘పిల్లా నువ్వే లేని జీవితం' నిన్న విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమా యూత్ ఫుల్ అండ్ వినోదాత్మకంగా ఉండటం కలిసొచ్చింది. ఇక మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో కావడంతో తొలి రోజు మంచి వసూళ్లు రాబట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిసి ఈ చిత్రం తొలి రోజు రూ. 2.3 కోట్ల షేర్ రాబట్టింది.
కొత్త హీరో సినిమాకు ఈ రేంజిలో ఓపెనింగ్స్ రావడం విశేషమే. ఏది ఏమైనా....సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ సక్సెస్ కావడంతో మెగా ఫ్యామిలీలో, అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా నటించిన చిత్రం 'పిల్లా నువ్వు లేని జీవితం'. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషించారు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించారు. బన్ని వాసు, హర్షిత్ నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పకులు. నవంబర్ 14న ఈచిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.
ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి, నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.


Click it and Unblock the Notifications











