Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాక్సాఫీస్ వద్ద మోడీ బయోపిక్ హవా.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే
మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'పీఎం నరేంద్ర మోదీ'. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ పోషించారు. కౌంటింగ్ తర్వాతి రోజైన మే 24 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను హిందీతో పాటు దేశంలోని 23 భాషల్లో విడుదల చేయడం విశేషం. మోదీ టీ అమ్మే స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు ఎలా ఎదిగారో ఈ చిత్రంలో చూపించారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో చిత్రానికి మంచి స్పందన వస్తోంది. చిత్రంలో మోడీగా వివేక్ ఒబెరాయ్ నటన ప్రేక్షక లోకాన్ని బాగా ఆకట్టుకుంటోంది. మే 24 న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ కాస్త డీలా పడ్డాయి. క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ ఇవ్వకపోయినప్పటికీ మౌత్ టాక్ తో వెంటనే పుంజుకున్న ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు మంచి వసూళ్లు రాబట్టింది.
సినిమా విడుదలైన మొదటి రోజు 2 .88 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కాస్త పుంజుకొని 3.76 కోట్లు రాబట్టింది. ఇక ఆ వెంటనే మూడో రోజు 4.50 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం విశేషం. మొత్తంగా చూస్తే మూడు రోజుల్లో ఈ సినిమా 11. 14 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. పబ్లిక్ వాయిస్, మోడీ రెండోసారి విజయకేతనం ఎగురవేయడం కారణంగా ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకా బెస్ట్ కలెక్షన్స్ రాబతుందని అంటున్నారు విశ్లేషకులు.
నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాస్త డిలే అయింది. విడుదలకు ముందు కొన్ని వివాదాలు చెలరేగడంతో ఎలక్షన్స్ తర్వాతనే విడుదల చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మేరకు చిత్రాన్ని ఎన్నికల ఫలితాల అనంతరం ప్రేక్షకుల ముందుంచారు. ఈ సినిమాలో మోదీ బాల్యం నుంచి జరిగిన సంఘటనలన్నీ చూపించారు. బాల్యంలో ఆయన చాయ్ అమ్ముకోవడం, చదువుకునే రోజుల్లో ఆయన ఆర్ఆర్ఎస్లో జాయిన్ కావడం.. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా.. ఆ పై దేశ ప్రధానిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.