Just In
- 2 hrs ago
‘RRR’ తర్వాత రామ్ చరణ్ చేసేది ఆయనతోనే.. చిరంజీవి సలహా వల్లే ఈ నిర్ణయం.!
- 3 hrs ago
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- 4 hrs ago
ఆసక్తి రేకెత్తించిన క్వీన్ ట్రైలర్.. అమ్మగా ఆకట్టుకున్న రమ్యకృష్ణ
- 4 hrs ago
అత్యాచారం తప్పదనుకున్నప్పుడు వెనక్కి పడుకుని ఎంజాయ్ చేయండి.. అమితాబ్ సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Technology
బెటర్ సెక్యూరిటీతో క్వాల్కామ్ 3డి సోనిక్ మ్యాక్స్
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పోకిరి: 63 కేంద్రాలలో 175 రోజులు
మామూలుగా చూస్తే అది ఒక సాదాసీదా చిత్రం. ఒక యువకుడు జులాయిలా వీధుల వెంట తిరుగుతూ.. అల్లరిచిల్లరి పనులు చేస్తూ.. మాఫియా ముఠాలతో కలిసి డబ్బు కోసం ఏ పనైనా చేస్తుంటాడు. మధ్యలో ఒకమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిని మాఫియా ముఠా కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ వేధిస్తుంటాడు. అతడి బారి నుంచి హీరోయిన్‌ని రక్షిస్తుంటాడు హీరో. అతనికీ ఆ అమ్మాయి మనసు ఇస్తుంది.. ఐ లవ్ యూ చెప్పే టైమ్‌కి వాళ్లిద్దరి మధ్య నుంచి బులెట్ దూసుకుపోవడం.. నేను ఎంత యెదవనో నాకే తెలియదని హీరో తన నిజస్వరూపం ఆమెకు చెప్పడం.. అతడిని ప్రేమించాలా వద్దా అని హీరోయిన్ డైలమో.. చివరికి చిన్న ట్విస్ట్.. హీరో అతడనుకునేంత, ప్రేక్షకులు అనుకునేంత దుర్మార్గుడు కాదు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అని తెలియడం, శేషంగా మిగిలిన విలన్లను హీరో అంతం చేసి.. ఆ వూరిని రక్షించడం.. ఇంతే కథ.. ఇలాంటి కథలు తెలుగులోనూ, భారతదేశ చలనచిత్ర చరిత్రలోనూ కొత్తేం కాదు. సినిమా పుట్టిన నాటి నుంచి అడపాదడపా ఇలాంటి కథలు వస్తునే ఉన్నాయి. కానీ అవేవీ చరిత్ర సృష్టించలేదు.. పోకిరీ లాగ. మరి పోకిరీలో ప్రత్యేకత ఏమిటి?
ఇదే విషయాన్ని ఇటీవల దర్శకుడు పూరీ జగన్నాథ్‌ని కలిసి అడిగినప్పుడు.. ఆ సినిమాకి అన్నీ కలిసొచ్చాయండీ.. అని క్లుప్తంగా చెప్పారంతే. ఎంత కలిసొస్తే మాత్రం పోకిరి ఇన్ని రికార్డులు బద్దలకొడుతుందా? 63 కేంద్రాలలో 175 రోజులు ఆడిన పోకిరి చిత్రం భారత చలనచిత్ర రంగంలోనే ఒక చరిత్ర సృష్టించింది.
ఈ చిత్రం ఇప్పటికే 40 కోట్ల రూపాయలు పైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఒక స్టార్‌కి సూపర్‌స్టార్‌డమ్ అందించిన చిత్రం పోకిరి. మహేశ్‌బాబుకి కెరీర్‌లో ఇంతకన్నా కావాల్సిందేముంటుంది? అతని అద్భుతమైన నటన, హీరోయిన్ ఇలియానా అందచందాలు, మణిశర్మ సంగీతం, ముఖ్యంగా హీరో క్యారక్టరైజేషన్‌లో మొదటి నుంచి చివరివరకూ ఒకే ఎనర్జీ లెవెల్ మెయింటేన్ చేయడంలో దర్శకుడు చూపిన ప్రతిభ.. ఇంతకుమించి ఈ సినిమా ఘనవిజయం సాధించడానికి అంశాలేమీ కనపడవు.
ఈ సినిమా చాలారకాలుగా చాలామందికి మంచి చేసింది. మహేశ్ కెరీర్ నిలిపింది. ఇలియానాను టాప్ హీరోయిన్ చేసింది. పూరీ జగన్నాథ్‌కు సూపర్ డైరెక్టర్ హోదా ఇచ్చేసింది. అన్నింటికీ మించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక సాలిడ్ హిట్ పోకిరి చిత్రం ద్వారా అందింది.
మహేశ్‌బాబు తదుపరి చిత్రం సైనికుడు కూడా సిద్ధమవుతోంది. పోకిరి ప్రభంజనం సాధించిన నేపథ్యంలో వస్తున్న ఆ చిత్రం మరెన్ని అద్భుతాలు చేస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.