ఇప్పటివరకు పోకిరిదే పైచేయి
ఇప్పటి అన్ని చిత్రాల్లోకీ మహేష్‌బాబు- పూరీ జగన్నాధ్‌ల పోకిరి పైచేయిగా ఉంది. కథ యావరేజి అయినా మహేష్‌బాబు నటన, కొత్త గెటప్, పూరీ జగన్నాధ్ కథనం సినిమాకు జీవం పోశాయి. ఈ సినిమాకు ఒక రోజు తర్వాత విడుదలైన బాలకృష్ణ వీరభద్రకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా చాలాకాలం తర్వాత వచ్చిన బాలకృష్ణ సినిమా కాబట్టి ఈ సినిమా ఫ్లాప్‌నుంచి యావరేజికి ఎగబాకే అవకాశాలు లేకపోలేదు. మరో పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ బంగారం ను విశ్లేషించడానికి ట్రేడ్ వర్గాలు వెనుకా ముందూ ఆడుతున్నాయి. ఈ సినిమాలో పరిమితికి మించిన హింస ఉండడంతో కుటుంబసమేతంగా సినిమాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండకపోవచ్చు. సినిమా సెకండాఫ్‌లో అనవసర ఫైటింగ్ సన్నివేశాలు, ఇతర దృశ్యాలకు ఇప్పటికైనా కత్తెర వేస్తే సినిమా కొంత నిలబడవచ్చన్నది దాదాపు అందరి అభిప్రాయం. అలాగని మాస్‌కు కూడా పూర్తిగా పట్టే సినిమాలా ఇది కన్పించడం లేదు. దీని ఫలితం ఇప్పటికే తేలిపోయినా ట్రేడ్ వర్గాలు ఎందు తటపటాయిస్తున్నాయో అర్ధం కావడం లేదు. మరో కుటుంబ కథా చిత్రం లేకపోవడంతో శ్రీ రామదాసు కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











