twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ 'పోకిరి' ఏమైంది?

    By Staff
    |

    ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోద్దో...వాడే పండుగాడు' డైలాగ్ గుర్తుంది కదా. తెలుగులో రికార్డు కలెక్షన్స్ సొంతం చేసుకున్న 'పోకిరి' చిత్రం హిందీ రీమేక్ 'వాంటెడ్' ఈ రోజే(శుక్రవారం)రిలీజైంది. అలాగే మంచి హిట్ నే నమోదు చేసే అవకాశం ఉందంటూ రివ్యూలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరక్ట్ చేసారు. హీరోగిరి,అమాయికంగా కనిపిస్తూ గ్లామర్ ఒలకపోసే హీరోయిన్, కరెప్ట్ పోలీస్ ఆఫీసర్, ఓ పెద్ద డాన్,డాన్ గారి మాల్, అతని హెంచమెన్స్ ఇలా ఈ చిత్రం బాలీవుడ్ పాతరోజులు గుర్తు చేసి ఆనందపరిచిందంటున్నారు. పక్కా మాస్ మసాలా వచ్చిన ఈ చిత్రం రియలిస్టిక్, పారలల్ సినిమాలతో ప్రయోగాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ లో ఓ కొత్త ఉత్సాహాన్ని తెచ్చినట్లేనని మురుస్తున్నారు.

    ఈ చిత్రం హీరో సల్మాన్ హార్డ్ కోర్ గ్యాంగస్టర్ గా,ప్రకాష్ రాజ్ తన దైన శైలిలో ఘనీ భాయ్ గాను కనిపించారు. అలాగే సల్మాన్ ని ప్రేమించే జాహ్నవిగా ఆయోషా తకియా కనివిందు చేస్తే ఆమెను హెరాస్ చేసే పోలీస్ ఆఫీసర్ గా మహేష్ ముంజ్రేకర్ కనిపిస్తారు. ఇక ప్రభుదేవా గజనీ చిత్రానికి పోటీ ఇచ్చేలా ప్రతీ యాక్షన్ సీన్, స్టంట్, ఛేజ్ అధ్బుతంగా తీర్చిదిద్దారని అంటున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే సల్మాన్ నటన అదరకొట్టి సినిమాను నిలబెట్టిందంటున్నారు.ముఖ్యంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో సల్మాన్‌తో కలిసి అనిల్‌కపూర్‌, గోవిందా ఒక పాటలో నృత్యం చేశారు. ఈ పాట కనీ వినీ ఎరుగని రీతిలో ఉండాలని సల్మాన్‌ అన్నారట. స్వతహాగా నృత్యదర్శకుడైనప్పటికీ ప్రభుదేవా ఈ చిత్రంలో కొరియోగ్రఫీ జోలికి వెళ్లలేదు. కానీ, ఈ ఒక్క పాటకి మాత్రం ఆయన నృత్యదర్శకత్వం చేశారు. ఈ చిత్రానికి సాజిద్‌-వాజిద్‌ సంగీతం అందించారు.

    ఏదైమైనా ఈ సినిమా హిట్టయితే ఒక తెలుగు రీమేక్ చాలా కాలం తర్వాత బాలీవుడ్ లో జెండా ఊపినట్లే. ఆ క్రెడిట్ పూర్తిగా పూరీ జగన్నాధ్ కే చెందుతుంది.ఇక తెలుగు 'పోకిరి'. సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో తీసారు. సూపర్ హిట్ కావటంతో ఈ సినిమా దాదాపు 40 కోట్లకు పైగా ఎలా వసూలు చేయగలిగింది. 300 కేంద్రాల్లో 50 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు, 15 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 300 రోజులు, 1 కేంద్రంలో 400 రోజులు ఆడింది. ఇక మరి హిందీలో ఈ చిత్రం ఎటువంటి రికార్డులు సృష్టించనుందో వేచి చూడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X