PS2 Collections: స్టార్ హీరో రికార్డు బ్రేక్.. టాప్ మూవీగా పొన్నియన్ సెల్వన్ 2
గతంలో కంటే ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు చాలానే వస్తున్నాయి. ముఖ్యంగా తమిళంలోనూ ఈ తరహా సినిమాలు ఎక్కువ సంఖ్యలోనే తెరకెక్కుతోన్నాయి. ఇలా గత ఏడాది ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 1' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన రావడంతో భారీ కలెక్షన్లు వచ్చి సూపర్ హిట్ అయింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండానే దీనికి సీక్వెల్‌గా 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపకల్పనలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి మొదటి భాగం కంటే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆరంభంలోనే దీనికి అదిరిపోయే వసూళ్లు దక్కాయి. కానీ, రెండో వారం నుంచి ఈ చిత్రానికి కలెక్షన్లు మాత్రం నిరాశజనకంగానే వస్తున్నాయి. అయినప్పటికీ ఈ మూవీ రెండు వారాల్లోనే ఏకంగా రూ. 300 కోట్లు గ్రాస్ మార్కును దాటింది. తద్వారా ఈ మార్కును చేరిన అతి తక్కువ చిత్రాల లిస్ట్‌లో చేరింది.

ఎంతో మంది స్టార్ల కలయికలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ రెండు వారాల్లోనే ఏకంగా రూ. 308.35 కోట్లు గ్రాస్, రూ. 148.25 కోట్లు షేర్ వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక గ్రాస్‌ను రాబట్టిన తమిళ చిత్రంగా ఇది రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే ఇళయదళపతి విజయ్ నటించిన 'వారిసు' (301.40 కోట్ల రూపాయలు) రికార్డును బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక, అన్ని ఏరియాల్లోనూ చక్కగా రాణిస్తోన్న ఈ చిత్రం తెలుగులో మాత్రం భారీ నష్టాల దిశగా సాగిపోతోంది.
ఇదిలా ఉండగా.. చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటుల కలయికలో మణిరత్నం రూపొందించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఈ భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











