Ponniyin Selvan 2 Advance booking Collections ఓవర్సీస్‌లో పొన్నియన్ సెల్వన్ 2 మూవీకి భారీ ఓపెనింగ్స్..
దేశంలో గర్వించ దగిన దర్శకుడు మణిరత్నం చిరకాల స్వప్నం పొన్నియన్ సెల్వన్ చిత్రం పార్ట్ 1 ఇప్పటికే విడుదలై భారీ విజయం అందుకొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ తన సొంత బ్యానర్ లైకా ప్రొడక్షన్‌పై నిర్మించి పార్ట్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 28 తేదీన రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు. విక్రమ్, త్రిష, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య మీనన్ లాంటి నటీనటులు నటించిన ఈ చిత్ర ప్రమోషన్స్ జోరందుకొన్నాయి. ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలకు తగినట్టుగా అడ్వాన్స్ బుకింగ్ ఉందా? అనే విషయంలోకి వెళితే..
తమిళనాడులో భారీగా ఓపెనింగ్స్: పొన్నియన్ సెల్వన్ 2 చిత్రానికి తమిళనాడులో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ చెన్నైలో ఇటీవల మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన 413 షోలు చెన్నైలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే 52 శాతం ఆక్యుపెన్సీ నమోదయ్యాయి. దాంతో ఈ సినిమాకు 1.3 కోట్ల రూపాయలు కలెక్షన్లు వసూలు అయ్యాయి. ఇంకా రెండు రోజులు ఉన్నందున్న అడ్వాన్స్ బుకింగ్ మరింత పెరగవచ్చని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడించారు.

అమెరికాలో తమిళ వెర్షన్‌కు: పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర అడ్వాన్స్ బుకింగ్‌కు అమెరికాలో మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాను యూఎస్‌లో 478 లోకేషన్లలో 1470 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు 440K అమెరికా డాలర్లు వసూలు చేసింది. తమిళ వెర్షన్‌కు 415K, తెలుగు వెర్షన్‌కు 25K అమెరికన్ డాలర్లు రాబట్టింది.
ఆస్ట్రేలియాలో అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉందంటే?: ఆస్ట్రేలియాలో పొన్నియన్ సెల్వన్ 2 సినిమా అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతన్నది. ఈ సినిమాను 82 లోకేషన్లలో, 289 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 10700 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి.. ఇంకా ఈ రేంజ్ పెరిగే అవకాశాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంగ్లాండ్‌లో మంచి రెస్పాన్స్‌తో : ఇక పొన్నియన్ సెల్వన్ 2 సినిమాకు ఇంగ్లాండ్‌లో భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించి 14 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. తమిళ వెర్సన్‌కు సంబంధించి 13 వేలకుపైగా టికెట్లు, తెలుగు వెర్షన్‌కు సంబంధించి 600 టికెట్లు, హిందీ వెర్షన్‌కు సంబంధించి 41 టికెట్లు అమ్ముడయ్యాయి. దాంతో ఈ సినిమాకు సుమారు 2 కోట్ల రూపాయలు కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి.
వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? : పొన్నియన్ సెల్వన్ 2 ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన అడ్వాన్స్ బుకింగ్ వసూళ్ల వివరాల్లోకి వెళితే.. యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో కలిపి ఇప్పటి వరకు 900K అమెరికన్ డాలర్లు అంటే 7.3 కోట్లు వసూలు చేసింది. అలాగే చెన్నైలో 1.3 కోట్ల రూపాయలతో కలిపితే.. దాదాపు 8.6 కోట్లు రాబట్టింది. కర్నాటక, ఏపీ, తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











