Ponniyin Selvan 2 day 1 Collections పొన్నియన్ సెల్వన్ 2 కలెక్షన్ల సునామీ.. 100 కోట్లకు చేరువగా మణిరత్నం మూవీ!
సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 పెంచిన భారీ అంచనాలతో పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాల, ఐశ్వర్య లక్ష్మీ, రెహ్మాన్ తదితరులు నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజైంది. ఇక పొన్నియన్ సెల్వన్ 2 చిత్రం తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబట్టిందంటే?
తొలి రోజే సూపర్ హిట్ టాక్: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 విషయానికి వస్తే.. కొంత మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. పూర్తిగా తమిళ నేటివిటితో కూడిన కథ కావడం, ఆ పాత్రల పేర్లు, వారి మధ్య రిలేషన్స్ కొంత నాన్ తమిళ్ ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసింది. పొన్నియన్ సెల్వన్ 2 సినిమాకు వస్తే.. అలాంటి గందరగోళం లేకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రేక్షకులకు ఒక కిక్ లాంటిది లభించింది. తొలి రోజే సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ ప్రయాణం మొదలుపెట్టింది.

ఫస్ట్ డే ఇండియాలో ఆక్యుపెన్సీ: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాకు తొలి ఆట నుంచి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ మొదలైంది దాంతో ఈ సినిమాపై పూర్తిగా పాజిటివ్ వైబ్ నెలకొన్నది. పాజిటివ్ టాక్ ప్రభావంతో ఈ సినిమా ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. తమిళంలో 60 శాతం ఆక్యుపెన్సీ, హిందీలో 10 శాతం, మలయాళంలో 34 శాతం, తెలుగులో 35 శాతం, కన్నడలో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్లు: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమా తమిళనాడు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 21 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. కేరళలో 2.8 కోట్ల గ్రాస్, తెలుగులో ఈ చిత్రం 3.6 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 3.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం 3.5 కోట్లు, హిందీలో 1 కోటి గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 32 కోట్ల గ్రాస్, 27 కోట్ల షేర్ రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఎంతంటే?: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో A$320,512 అంటే భారతీయ కరెన్సీలో 2.62 కోట్ల గ్రాస్, న్యూజిలాండ్‌లో NZ$ 43,869 అంటే 2.21 కోట్ల రూపాయలు, యూకేలో £160,395 అంటే 1.64 కోట్ల గ్రాస్, సింగపూర్‌లో SGD250,000 అంటే 1.5 కోట్ల గ్రాస్, మలేషియాలో 2.75 కోట్లు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో 1 మిలియన్ డాలర్లు అంటే 8.17 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 64 కోటల్ గ్రాస్‌ను మొదటి రోజు వసూలు చేసింది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?: ఇక పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విసయానికి వస్తే.. ఈ చిత్రం తమిళ థియేట్రికల్ హక్కులు 80 కోట్లుగా వ్యాల్యూ వేశారు. ఎందుకంటే ఈ సినిమాను లైకా సొంతంగా రిలీజ్ చేసింది. ఇక ఆంధ్రాలో 10 కోట్లు, కేరళ థియేట్రికల్ హక్కులు 9 కోట్లు, హిందీ, కన్నడ, ఇతర రాష్ట్రాల హక్కులు 21 కోట్లు, కేరళలో 9 కోట్లు, ఓవర్సీస్‌లో 50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం మొత్తంగా 170 కోట్ల మేర బిజినెస్ చేసింది.

పొన్నియన్ సెల్వన్ 2 లాభాల్లోకి రావాలంటే?: పొన్నియన్ సెల్వన్ 2 సినిమా 175 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ చిత్రం కలెక్షన్ల జోష్ చూస్తే.. ఈ సినిమా తొలి వారంలోనే ఈ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రం ఇండియాలో 27 కోట్ల షేర్, 15 కోట్ల షేర్ సాధించింది. దాంతో ఈ చిత్రం సుమారు 42 కోట్ల షేర్ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం రెండో రోజు 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











