PS2 Collections: సండే ఏకంగా అన్ని కోట్లు.. తెలుగులో మాత్రం దారుణం.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

ఒకప్పుడు బాలీవుడ్‌లోనే ఎక్కువగా మల్టీస్టారర్ మూవీలు వచ్చేవి. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం దక్షిణాదిలో కూడా ఆ తరహా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా వచ్చిన భారీ బడ్జెట్ చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 1'. తమిళంలోని ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అవడంతో.. దీనికి కొనసాగింపుగా ఇటీవలే 'పొన్నియన్ సెల్వన్ 2' వచ్చింది. అదే కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్ 2' 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

స్టార్ల కలయికలో వచ్చిన మూవీ: చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

PS2 Collections

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్ : చోళుల కాలం నాటి కథతో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ జరిగింది.

తెలుగు 10వ రోజు వసూళ్లి ఇలా: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలో మంచి రెస్పాన్స్ అభించింది. కానీ, వీక్ డేస్‌లో స్పందన అంతగా రాలేదు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు క్రమంగా పడిపోతోన్నాయి. అయితే, 9వ రోజు రూ. 15 లక్షలు రాబట్టిన ఈ మూవీ.. 10వ రోజైన ఆదివారం మాత్రం కాస్త పెంచుకుని రూ. 17 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

PS2 Collections

10 రోజులకూ తెలుగు కలెక్షన్లు: 'పొన్నియన్ సెల్వన్ 2' 10 రోజుల్లో ఏపీ, తెలంగాణలో తక్కువే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 3.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 53 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 56 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 41 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 6.48 కోట్లు షేర్, రూ. 13.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?: భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 6.48 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.02 కోట్లు వసూలు అయితేనే ఇది తెలుగులో హిట్ మూవీగా మారుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?: 'పొన్నియన్ సెల్వన్ 2' ప్రపంచ వ్యాప్తంగా బాగానే రాణించింది. దీనికి 10 రోజుల్లో తెలుగులో రూ. 13.60 కోట్లు, తమిళంలో రూ. 106.45 కోట్లు, కర్నాటకలో రూ. 18.40 కోట్లు, కేరళలో రూ. 14.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 20.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 115.80 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 289.65 కోట్లు గ్రాస్‌, రూ. 139.40 కోట్లు షేర్ వచ్చింది.

PS2 Collections

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?: ప్రపంచ వ్యాప్తంగా 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 139.40 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 32.60 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X