PS2 Collections: 300 కోట్లకు దగ్గరలో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. అయినా టార్గెట్ ఫినిష్ కాలేదు!

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి క్రేజ్ అందుకున్న అతి కొద్ది మంది దర్శకులలో మణిరత్నం ఒకరు. ఒకప్పుడు అసలైన ప్లాన్ ఇండియా అనే పదానికి ఆయన సరికొత్త అర్ధం తీసుకోవచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం వివిధ రకాల ప్రయోగాలతో మణిరత్నం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోతున్నారు.

ఇక ఆయన డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ 2 ఇటీవల గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా 11 రోజుల బాక్సాఫీస్ పోరాటంలో రికార్డులను క్రియేట్ చేసినప్పటికీ కూడా అనుకున్న టార్గెట్ మాత్రం పూర్తి చేయలేకపోతోంది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే కలెక్షన్స్ ఇంకొన్ని రోజులు స్టడీ గానే ఉండాలి. ఫైనల్ గా సినిమా 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

Ponniyin Selvan 2 Movie 11 Days Worldwide Box Office Collections

PS 2 బిజినెస్ ఎంతంటే: స్టార్ నటీనటులు చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2' మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

ఇక చోళుల కాలం నాటి కథతో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.

Ponniyin Selvan 2 Movie 11 Days Worldwide Box Office Collections

తెలుగులో 11వ రోజు వచ్చిన కలెక్షన్స్: చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వీకెండ్స్ అనంతరం మెల్లగా తగ్గుతూ వచ్చయి. 10వ రోజు రూ. 17 లక్షలు రాబట్టిన ఈ సినిమా.. 11వ రోజైన ఆదివారం మాత్రం కాస్త పెంచుకుని రూ. 9 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

Ponniyin Selvan 2 Movie 11 Days Worldwide Box Office Collections

11 రోజుల టోటల్ తెలుగు కలెక్షన్లు: 'పొన్నియన్ సెల్వన్ 2' 11 రోజుల్లో ఏపీ, తెలంగాణలో తక్కువే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 3.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 54 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 57 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 6.57 కోట్లు షేర్, రూ. 13.85 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Ponniyin Selvan 2 Movie 11 Days Worldwide Box Office Collections

బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఎంత రావాలంటే: భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు తగ్గట్టుగా ఏపి, నైజాం లో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 6.48 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.93 కోట్లు వసూలు అయితేనే ఇది తెలుగులో హిట్ మూవీగా మారుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్?: 'పొన్నియన్ సెల్వన్ 2' వరల్డ్ వైడ్ గా బాగానే రాబట్టింది. 11 రోజుల్లో తెలుగులో రూ. 13.85 కోట్లు, తమిళంలో రూ. 111.45 కోట్లు, కర్నాటకలో రూ. 19.05 కోట్లు, కేరళలో రూ. 15.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 21.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 116.80 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 297.65 కోట్లు గ్రాస్‌, రూ. 142.40 కోట్లు షేర్ వచ్చింది.

Ponniyin Selvan 2 Movie 11 Days Worldwide Box Office Collections

ఇంకా టార్గెట్ కు దూరంగానే: ప్రపంచ వ్యాప్తంగా 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.ఇక ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్ల గ్రాస్ కు దగ్గరైంది. ఇక, 11 రోజుల్లో ఈ సినిమా రూ. 142.8ట్ కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 29.15 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X