PS2 Collections: 13 రోజుల్లో అన్ని వందల కోట్లు.. హిట్‌కు అన్ని కోట్ల దూరంలో.. తెలుగులో మాత్రం దారుణం

పేరున్న ఎంతో మంది నటీనటులు కలిసి చేసిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. గత ఏడాది విడుదలైన ఈ సినిమా చోళుల కాలం నాటి కథతో రూపొందింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఇటీవలే దీనికి సీక్వెల్‌గా 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రాన్ని తీసుకు వచ్చారు. దీనికి మొదటి భాగం కంటే మంచి టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్ 2' 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

భారీ బడ్జెట్‌తో వచ్చిన సినిమా:కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఈ భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

Ponniyin Selvan 2 Movie 13 Days Worldwide Box Office Collections

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్:చాలా మంది స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ అయింది.

Ponniyin Selvan 2 Movie 13 Days Worldwide Box Office Collections

తెలుగు 13వ రోజు వసూళ్లి ఇలా:భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఆ తర్వాత నుంచి స్పందన అంతగా రావట్లేదు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు క్రమంగా పడిపోతోన్నాయి. ఇలా 12వ రోజు రూ. 5 లక్షలు మాత్రమే రాబట్టిన ఈ మూవీ.. 13వ రోజైన బుధవారం మాత్రం కేవలం రూ. 3 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

13 రోజులకూ తెలుగు కలెక్షన్లు:13 రోజుల్లో 'పొన్నియన్ సెల్వన్ 2' ఏపీ, తెలంగాణలో తక్కువే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 3.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 59 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 6.65 కోట్లు షేర్, రూ. 14.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Ponniyin Selvan 2 Movie 13 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?:తమిళ బాహుబలి 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 6.65 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.85 కోట్లు వసూలు అయితేనే ఇది తెలుగులో హిట్ మూవీగా నిలుస్తుంది.

Ponniyin Selvan 2 Movie 13 Days Worldwide Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?:ప్రపంచ వ్యాప్తంగా 'పొన్నియన్ సెల్వన్ 2' బాగానే రాణించింది. దీనికి 13 రోజుల్లో తెలుగులో రూ. 14.15 కోట్లు, తమిళంలో రూ. 116.40 కోట్లు, కర్నాటకలో రూ. 19.85 కోట్లు, కేరళలో రూ. 15.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 22.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 116.70 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 305.50 కోట్లు గ్రాస్‌, రూ. 146.85 కోట్లు షేర్ వచ్చింది.

Ponniyin Selvan 2 Movie 13 Days Worldwide Box Office Collections

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?:'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 146.85 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 25.15 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X