PS2 Collections: తమిళ బాహుబలికి బిగ్ షాక్.. 170 కోట్ల సినిమాకు వారంలో ఘోరంగా.. ఇంకెంత రావాలంటే!
గతంలో కంటే ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీల నుంచి భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. వాటికి మంచి రెస్పాన్స్, కలెక్షన్లు కూడా అత్యధికంగానే వస్తున్నాయి. అలా గత ఏడాది వచ్చిన సినిమానే 'పొన్నియన్ సెల్వన్ 1'. ఇది సూపర్ హిట్ అవడంతో దీనికి ఇప్పుడు సీక్వెల్‌గా 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి ఓవరాల్‌గా మంచి వసూళ్లే వచ్చినా.. తెలుగులో డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తమిళ బాహుబలి చిత్రానికి వారంలో ఎంత వచ్చిందో మీరే చూడండి!
ఎంతో మంది స్టార్లు కలిశారుగా:చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి ఆయనే స్వయంగా నిర్మించారు. దీనికి లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్:భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో దాదాపు రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ అయింది.

తెలుగు 7వ రోజు వసూళ్లి ఇలా:సూపర్ హిట్ మూవీకి సీక్వల్‌గా వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలో మంచి స్పందనే వచ్చింది. కానీ, వీక్ డేస్‌లో అంతగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు డౌన్ అవుతూ వస్తున్నాయి. దీంతో 6వ రోజు రూ. 22 లక్షలు రాబట్టి.. 7వ రోజైన గురువారం మాత్రం ఈ చిత్రం కేవలం రూ. 13 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

వారం రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'పొన్నియన్ సెల్వన్ 2' వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో తక్కువే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 3.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 51 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 37 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 6.05 కోట్లు షేర్, రూ. 12.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?:క్రేజీ కాంబోలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 6.05 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.45 కోట్లు వసూలు అయితేనే ఇది తెలుగులో హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?:'పొన్నియన్ సెల్వన్ 2' ప్రపంచ వ్యాప్తంగా బాగానే రాణించింది. దీనికి వారంలోనే తెలుగులో రూ. 12.50 కోట్లు, తమిళంలో రూ. 84.05 కోట్లు, కర్నాటకలో రూ. 15.20 కోట్లు, కేరళలో రూ. 12.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 16.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 110.05 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 250.55 కోట్లు గ్రాస్, రూ. 120.75 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?:'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 120.75 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 51.25 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











