PS2 Collections: 500 కోట్ల సినిమా.. 2 వారాల్లో ఊహించని విధంగా.. తెలుగులో అన్ని కోట్ల నష్టం తప్పదా!
దక్షిణాది మొత్తంలోనూ ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'పొన్నియన్ సెల్వన్ 1'. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో దీనికి ఇప్పుడు సీక్వెల్‌గా 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దీనికి మొదటి భాగం కంటే పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం నిరాశజనకంగానే వస్తున్నాయి. ఇలా రెండు వారాల్లో ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్ 2' 14 రోజుల్లో రిపోర్ట్ మీకోసం!
రెండో భాగంతో వచ్చేశారుగా:లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపకల్పనలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఈ భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్:దాదాపు రూ. 500 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 170 కోట్ల బిజినెస్ జరిగింది.
తెలుగు 14వ రోజు వసూళ్లి ఇలా:కోలీవుడ్‌లోని చాలా మంది స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలో మంచి స్పందన దక్కింది. కానీ, ఆ తర్వాత క్రమంగా రెస్పాన్స్ అంతగా రావట్లేదు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు డౌన్ అవుతోన్నాయి. ఇలా 13వ రోజు రూ. 3 లక్షలు మాత్రమే రాబట్టిన ఈ మూవీ.. 14వ రోజైన గురువారం కూడా రూ. 3 లక్షలు షేర్‌నే కలెక్ట్ చేసింది.

2 వారాలకూ తెలుగు కలెక్షన్లు:2 వారాల్లో 'పొన్నియన్ సెల్వన్ 2' ఏపీ, తెలంగాణలో తక్కువే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 3.82 కోట్లు, సీడెడ్‌లో రూ. 55 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 60 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 37 లక్షలు, కృష్ణాలో రూ. 42 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 6.68 కోట్లు షేర్, రూ. 14.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?:చోళుల కథతో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 6.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.82 కోట్లు ఇది వసూలు చేయాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమనే చెప్పాలి.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?:'పొన్నియన్ సెల్వన్ 2' ప్రపంచ వ్యాప్తంగా బాగానే రాణించింది. దీనికి 2 వారాల్లో తెలుగులో రూ. 14.30 కోట్లు, తమిళంలో రూ. 118.10 కోట్లు, కర్నాటకలో రూ. 20.20 కోట్లు, కేరళలో రూ. 15.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 23.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 116.75 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 308.35 కోట్లు గ్రాస్, రూ. 148.25 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?:ప్రపంచ వ్యాప్తంగా 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 2 వారాల్లో దీనికి రూ. 148.25 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 23.75 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











