PS2 Collections: 4వ రోజు భారీ వసూళ్లు.. అన్ని వందల కోట్లతో రికార్డు.. తెలుగులో ఎన్ని కోట్లో తెలిస్తే
సౌత్ ఇండియాలోని ఇండస్ట్రీల నుంచి ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ చిత్రాలు వస్తున్నాయి. అందులో చాలా వరకూ విజయాలను సొంతం చేసుకోవడంతో వాటికి కొనసాగింపుగా సీక్వెల్స్ కూడా తెరకెక్కుతోన్నాయి. ఇప్పుడు అలా వచ్చిన సినిమానే 'పొన్నియన్ సెల్వన్ 2'.
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' అనే పిరియాడిక్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో దీనికి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 4 రోజుల కలెక్షన్లను మీరే చూడండి మరి!

స్టార్ల కలయికలో రెండో భాగం: దిగ్గజ దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి సహా ఎంతో మంది స్టార్లు నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్: స్టార్ల కలయికలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో దాదాపు రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ అయింది.

తెలుగు 4వ రోజు వసూళ్లి ఇలా: 'పొన్నియన్ సెల్వన్ 2'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 రోజు వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 55 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రూ. 92 లక్షలు షేర్, రూ. 2.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

4 రోజుల్లో తెలుగు కలెక్షన్లు: 4 రోజులకు 'పొన్నియన్ సెల్వన్ 2' ఏపీ, తెలంగాణలో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 44 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 42 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 31 లక్షలు, కృష్ణాలో రూ. 32 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో.. రూ. 5.27 కోట్లు షేర్, రూ. 10.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.
టార్గెట్ ఎంత? ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 5.27 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5.23 కోట్లు వసూలు అయితేనే ఇది తెలుగులో హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?: ప్రపంచ వ్యాప్తంగా 'పొన్నియన్ సెల్వన్ 2' సత్తా చాటుతోంది. దీనికి రెండు రోజులకు కలిపి తెలుగులో రూ. 10.55 కోట్లు, తమిళంలో రూ. 67.55 కోట్లు, కర్నాటకలో రూ. 12.20 కోట్లు, కేరళలో రూ. 10.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 11.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 95.55 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 207.20 కోట్లు గ్రాస్, రూ. 100.05 కోట్లు షేర్ వచ్చింది.
ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?: 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 100.05 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 71.95 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











