PS2 Collections: సగానికి సగం డౌన్.. తమిళ బాహుబలికి కష్టాలు.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తూ.. సౌతిండియాలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో రకాల సినిమాలు చేసిన ఆయన.. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. గత ఏడాది వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు కొనసాగింపుగా 'పొన్నియన్ సెల్వన్ 2' వచ్చింది. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే అదిరిపోయే స్పందన వస్తోంది. కానీ, వీక్ డేస్‌లో మాత్రం రెస్పాన్స్ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 5 రోజుల కలెక్షన్లపై మీరే ఓ లుక్కేయండి మరి!

స్టార్ల కలయికలో రెండో భాగం:చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులతో.. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

Ponniyin Selvan 2 Movie 5 Days Worldwide Box Office Collections

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్:క్రేజీ కాంబోలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో దాదాపు రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ జరిగింది.

Ponniyin Selvan 2 Movie 5 Days Worldwide Box Office Collections

తెలుగు 5వ రోజు వసూళ్లి ఇలా:ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలో మంచి స్పందనే వచ్చింది. కానీ, వీక్ డేస్‌లో అంతగా రెస్పాన్స్ రావడం లేదు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు డౌన్ అవుతూ వస్తున్నాయి. దీంతో 4వ రోజు రూ. 92 లక్షలు రాబట్టి.. 5వ రోజైన మంగళవారం మాత్రం ఈ చిత్రం కేవలం రూ. 43 లక్షలు మాత్రమే వసూలు చేసింది.

5 రోజుల్లో తెలుగు కలెక్షన్లు:'పొన్నియన్ సెల్వన్ 2' 5 రోజులకు ఏపీ, తెలంగాణలో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 48 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 47 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 25 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో.. రూ. 5.70 కోట్లు షేర్, రూ. 11.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Ponniyin Selvan 2 Movie 5 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?:భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 5.70 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.80 కోట్లు వసూలు అయితేనే ఇది తెలుగులో హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?:'పొన్నియన్ సెల్వన్ 2' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 5 రోజులకు కలిపి తెలుగులో రూ. 11.50 కోట్లు, తమిళంలో రూ. 73.85 కోట్లు, కర్నాటకలో రూ. 13.45 కోట్లు, కేరళలో రూ. 10.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 13.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 102.50 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 225.50 కోట్లు గ్రాస్‌, రూ. 108.80 కోట్లు షేర్ వచ్చింది.

Ponniyin Selvan 2 Movie 5 Days Worldwide Box Office Collections

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?:'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 108.80 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 63.20 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X