PS2 Collections: భారీగా పెరిగిన వసూళ్లు.. 9 రోజుల్లోనే వందల కోట్లు.. తెలుగులో కోట్ల నష్టాల దిశగా!
తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చినా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి ఆ భాషలోనే టాప్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసిన చిత్రమే'పొన్నియన్ సెల్వన్'. పిరియాడిక్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన లభించింది.
ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పొన్నియన్ సెల్వన్ 2' వచ్చింది. అదే కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్ 2' 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

తమిళ బాహుబలిగా వచ్చింది: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఈ భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి మణిరత్నం స్వయంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్: ఎంతో మంది స్టార్లు నటించిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి తమిళంలో దాదాపు రూ. 80 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 170 కోట్ల బిజినెస్ అయింది.

తెలుగు 9వ రోజు వసూళ్లి ఇలా: అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆరంభంలో మంచి రెస్పాన్స్ అభించింది. కానీ, వీక్ డేస్‌లో స్పందన అంతగా రాలేదు. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు క్రమంగా పడిపోతోన్నాయి. దీంతో 8వ రోజు రూ. 11 లక్షలు రాబట్టిన ఈ మూవీ.. 9వ రోజైన శనివారం మాత్రం కాస్త పెంచుకుని రూ. 15 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.
9 రోజులకూ తెలుగు కలెక్షన్లు: 9 రోజుల్లో 'పొన్నియన్ సెల్వన్ 2' ఏపీ, తెలంగాణలో తక్కువే రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 3.58 కోట్లు, సీడెడ్‌లో రూ. 53 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 39 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 6.31 కోట్లు షేర్, రూ. 13.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 6.31 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.19 కోట్లు వసూలు అయితేనే ఇది తెలుగులో హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?: ప్రపంచ వ్యాప్తంగా 'పొన్నియన్ సెల్వన్ 2' బాగానే రాణించింది. దీనికి 9 రోజుల్లో తెలుగులో రూ. 13.15 కోట్లు, తమిళంలో రూ. 96.80 కోట్లు, కర్నాటకలో రూ. 17.15 కోట్లు, కేరళలో రూ. 13.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 19.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 114.30 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 273.80 కోట్లు గ్రాస్, రూ. 131.75 కోట్లు షేర్ వచ్చింది.
ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?: 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 170 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 172 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 131.75 కోట్లు షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 40.25 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేస్తేనే ఇది హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











