PS2 Business: తమిళ బాహుబలికి రికార్డు బిజినెస్.. ఫస్ట్ పార్ట్ కంటే అన్ని కోట్లు.. తెలుగులో మాత్రం!
దక్షిణాదిలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు పెద్దగా రావడం లేదన్న టాక్ ఉంది. దీంతో ఆ ఇండస్ట్రీ రేంజ్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్' అనే పిరియాడిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. దీంతో ఇప్పుడు సెకెండ్ పార్టును తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను మీరే చూడండి!

తమిళ బాహుబలిగా వచ్చింది: మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్ 2'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చారు. గత ఏడాది వచ్చిన పార్ట్ 1 హిట్ కొట్టింది.

స్టార్స్ కలయిక.. మరింతగానే: దిగ్గజ దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే మొదటి భాగాన్ని గత ఏడాది విడుదల చేయగా.. దానికి అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు రెండో భాగాన్ని మరింత హై రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

గ్రాండ్‌గా రిలీజ్.. ప్రమోషన్స్: పిరియాడిక్ జోనర్‌లో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీని ఏప్రిల్ 28వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు, ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే స్పందన వస్తోందని తెలిసింది.

అన్ని భాషల్లో భారీ డిమాండ్: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఆంధ్రా, తెలంగాణ బిజినెస్: 'పొన్నియన్ సెల్వన్' మొదటి భాగానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లు బిజినెస్ జరిగింది. అయితే, ఈ చిత్రం మాత్రం రూ. 50 లక్షలు వరకూ నష్టాలనే ఎదుర్కొంది. దీంతో ఇప్పుడు రెండో భాగం 'పొన్నియ సెల్వన్ 2' మూవీకి అన్ని ఏరియాల్లోనూ ఎక్కువ బిజినెస్ జరిగ్గా.. తెలుగులో మాత్రం అదే రూ. 10 కోట్లు అయింది. థియేటర్లు కూడా 340 మాత్రమే లభించాయి.

ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్: ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు తమిళనాడులో రూ. 80 కోట్లు, కేరళలో రూ. 9 కోట్లు, హిందీ ప్లస్ కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 21 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 50 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 170.00 కోట్లు వ్యాపారం జరిగింది.
అన్ని కోట్ల టార్గెట్.. రికార్డు: 'పొన్నియన్ సెల్వన్' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 170 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 172 కోట్లు షేర్ లేదా రూ. 335 కోట్లు గ్రాస్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. 'పొన్నియన్ సెల్వన్' మొదటి భాగానికి ఓవరాల్‌గా రూ. 130 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే.. దాని కంటే రూ. 40 కోట్లు బిజినెస్‌తో రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











