Ponniyin Selvan 2 business అయ్యో పాపం పొన్నియన్ సెల్వన్!.. ముఖం చాటేస్తున్న బయ్యర్లు
ఇండియాలో అగ్ర దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టుగా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై శుభాస్కరన్ అల్లీరాజా, మణిరత్నం నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిషా, జయరాం, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రభు, ఆర్ శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాశ్ రాజ్, రహ్మాన్, ఆర్ పార్తీబన్ లాంటి అగ్ర నటులు నటించి మెప్పించారు. అయితే పాన్ ఇండియా చిత్రంగా రిలీజైన ఈ చిత్రం తమిళంలో తప్ప.. మిగితా భాషల్లో దారుణమైన ఫలితాన్ని అందించింది. కేవలంలోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 బిజినెస్ వ్యవహారం దక్షిణాదిలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ వివరాల్లోకి వెళితే..
పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తమిళనాడులో 65 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ హక్కులను 10 కోట్లుగా, కేరళ హక్కులు 6 కోట్లుగా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో హక్కులు 14 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 35 కోట్లకు అమ్ముడుపోయాయనేది ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ఈ సినిమా బిజినెస్ 130 కోట్లుగా నమోదైంది.

అయితే పొన్నియన్ సెల్వన్ చిత్రం తమిళనాడులో 227 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 165 కోట్లకపైగా వసూళ్లను నమోదు చేసింది. తెలుగులో 19 కోట్ల గ్రాస్, 9 కోట్ల షేర్ రాబట్టింది. కేరళలో 23 కోట్లకుపైగా, కర్ణాటకలో 30 కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం సుమారు 500 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక త్వరలోనే పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 భారీగా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అయితే తెలుగు ప్రేక్షకులకు పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కనెక్ట్ కాకపోవడంతో భారీగా వసూళ్లు సాధించలేకపోయింది. దాంతో పార్ట్ 2కు బిజినెస్ వర్గాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగులో థియేట్రికల్ హక్కుల 10 కోట్ల చెల్లిస్తే.. 10 కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో డిస్టిబ్యూటర్లు బిజినెస్ విషయంలో వెనుకంజ వేస్తున్నారు. ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు అనే విషయం ప్రస్తుతం చర్చగా మారింది. అయితే రిలీజ్‌కు ఏ రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











