Ponniyin Selvan: I 13 days collections సరికొత్త చరిత్ర సృష్టించిన మణిరత్నం.. కమల్, రజనీ మూవీ రికార్డులు బ్రేక్

సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన చారిత్రాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్ తమిళ సినీ పరిశ్రమలో ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ తమిళ చిత్రం సాధించని ఫీట్‌ను బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకొన్నది. విక్మ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌ను నమోదు చేసుకొన్నది. గత 14 రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..

తమిళనాడులో ఆల్‌టైమ్ రికార్డు

తమిళనాడులో ఆల్‌టైమ్ రికార్డు

తమిళనాడులో పొన్నియన్ సెల్వన్ సినిమా రికార్డులు తిరగరాస్తున్నది. తొలివారం 127.68 కోట్లు సాధించిన ఈ చిత్రం రెండోవారంలో కూడా అదే ఊపును కొనసాగించింది. 2వ వారంలో తొలి రోజు 8.21 కోట్లు, రెండో రోజు 14.15 కోట్లు, మూడో రోజు 15.83 కోట్లు, నాలుగో రోజు 6.07 కోట్లు, ఐదో రోజు 5.22 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 175 కోట్ల మైలురాయిని అధిగమించి 177.16 కోట్ల రూపాయల కలెక్షన్లతో జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్‌గా

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్‌గా

తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. పొన్నియన్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొలేక దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకొన్నది. ఈ చిత్రం గత 13 రోజుల్లో 8.73 కోట్ల షేర్, 16.55 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లుగా జరిగింది. ఇంకా ఈ చిత్రం 1.7 కోట్లు రాబట్ట గలిగితే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

ఉత్తర అమెరికాలో కలెక్షన్ల వర్షం

ఉత్తర అమెరికాలో కలెక్షన్ల వర్షం

ఉత్తర అమెరికాలో పొన్నియన్ సెల్వన్ చిత్రం ప్రభంజనాన్ని సృష్టించింది. గతంలో రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం కలెక్షన్లను అధిగమించింది. తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో 6 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హిందీ, మలయాళం, కన్నడలో

హిందీ, మలయాళం, కన్నడలో

ఇక పొన్నియన్ సెల్వన్ చిత్రం వివిధ భాషల్లో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. హిందీ వెర్షన్‌కు సంబంధించి 25 కోట్లు, కేరళ, కర్ణాటక 22 కోట్లుకుపైగా వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 16 మిలియన్లు అంటే.. 130 కోట్ల కలెక్షన్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా

ఇక ప్రపంచవ్యాప్తంగా పొన్నియన్ సెల్వన్ చిత్రం తొలివారంలోనే 308.59 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. రెండోవారంలో ఈ చిత్రం తొలి రోజు 15.47 కోట్లు, రెండో రోజు 26.72 కోట్లు, మూడో రోజు 28.35 కోట్లు, నాలుగో రోజు 12.29 కోట్లు, ఐదో రోజు 10.21 కోట్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 415 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా వసూళ్ల రికార్డులను తిరగరాసింది.

పొన్నియన్ సెల్వన్‌కు లాభం ఎంతంటే?

పొన్నియన్ సెల్వన్‌కు లాభం ఎంతంటే?

పొన్నియన్ సెల్వన్ సినిమా థ్రియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో 132 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. గత 13 రోజుల్లో ఈ చిత్రం 415 కోట్ల గ్రాస్, 213 కోట్ల షేర్ సాధించింది. దీంతో ఈ చిత్రం 80 కోట్లకుపైగా లాభాలను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X