twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ponniyin Selvan day 1 Collections బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు.. తొలి రోజున ఎంత వసూలు చేసిందంటే!

    |

    సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట నుంచి మిశ్రమ స్పందన చూరగొంటున్నది. అయితే ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు కావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సానుకూలంగా మారింది. అయితే తొలి రోజు ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే..

    దేశంలోని ప్రధాన నగరాల్లో అక్యుపెన్సీ

    దేశంలోని ప్రధాన నగరాల్లో అక్యుపెన్సీ


    పొన్నియన్ సెల్వన్ చిత్రంలో భారీ తారాగణం, సూపర్ స్టార్లు నటించడంతో భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మండమైన అక్యుపెన్సీ కనిపించింది. చెన్నైలో తమిళ, తెలుగు, ఇతర భాషల వెర్షన్లకు 100 శాతం అక్యుపెన్సీ నమోదైంది. బెంగళూరులో తమిళ వెర్షన్‌కు 70 శాతం, ముంబైలో 50 శాతం, ఢిల్లీలో 40 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

    దక్షిణాదిలో అక్యుపెన్సీ

    దక్షిణాదిలో అక్యుపెన్సీ


    పొన్నియన్ సెల్వన్ సినిమా తెలుగు వెర్షన్ భారీగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయింది. హైదరాబాద్‌లో 40 శాతం, బెంగళూరులో 23 శాతం, చెన్నైలో 100 శాతం, విజయవాడలో 30 శాతం, వరంగల్‌లో 40 శాతం, గుంటూరులో 60 శాతం, వైజాగ్, నిజమాబాద్, ముంబైలో 40 శాతం, కరీంనగర్, మహబూబ్ నగర్, కాకినాడలో 53 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

    అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్‌లో

    అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్‌లో


    పొన్నియన్ సెల్వన్ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో దుమ్మురేపింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ల ద్వారా 442 లొకేషన్లలో 1,054,891 డాలర్లు, తొలి రోజున 403 లొకేషన్లలో 684,940 డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 1,754,891 డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్ల ద్వారానే ఒక మిలియన్ డాలర్ కలెక్షన్లను వసూలు చేసింది.

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలో

    ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలో


    ఇక అమెరికాను మినహాయిస్తే.. యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో భారీ రెస్పాన్స్ కనిపించింది. యూఏఈలో 580 షోలు ప్రదర్శించగా, 31 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. యూఏఈలో మొదటి రోజున 2.6 కోట్లు వసూలు చేసింది. ఇక న్యూజిలాండ్‌లో 23 లొకేషన్లలో 33 వేల డాలర్లను వసూలు చేసింది. ఇక అమెరికాలో 86 లోకేషన్లలో 3.5 లక్షల డాలర్లు రాబట్టింది.

     తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు


    పొన్నియన్ సెల్వన్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. నైజాంలో హైదరాబాద్‌తో కలిపి 4 కోట్ల మేర, ఆంధ్రాలో మరో 4 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్‌లోనే ఈ చిత్రం 1.12 కోట్లు రాబట్టడం విశేషం. సెకండ్ షోలకు అక్యుపెన్సీ పెరగడం వల్ల కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంద.ి

     ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే?

    ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసిందంటే?


    ఇక తమిళనాడులో ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. ఈ చిత్రం 27 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఈ చిత్రం 47 కోట్ల గ్రాస్ వసూళ్లను, ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

    English summary
    Mani Ratnam's Ponniyin Selvan: I started good note at Box office. Here are Expected day 1 collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X