Ponniyin Selvan: I Day 2 collections 100 కోట్ల క్లబ్‌లో మణిరత్నం మూవీ.. రజనీ, విజయ్ రికార్డులు ఫట్!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన పాన్ ఇండియా చిత్రం పొన్నియన్ సెల్వన్ బాక్సాఫీస్ యాత్ర ఘనంగా మొదలైంది. తొలి రోజు వసూళ్లను రాబట్టడంలో కొంత తడబాటు కనిపించినా.. రెండో రోజు భారీ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులుు పెడుతున్నది. విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి, రెహమాన్, కార్తీ, ప్రభు, జయరాం లాంటి అగ్ర నటులు నటించిన ఈ సినిమా రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

తొలి రోజు కంటే రెండో రోజు భారీగా

తొలి రోజు కంటే రెండో రోజు భారీగా

పొన్నియన్ సెల్వన్‌ చిత్రానికి తమిళంలో బ్రహ్మరథం పడుతున్నారు. అయితే తొలి రోజు కంటే రెండో రోజు భారీగా అక్యుపెన్సీ కనిపించింది. తమిళనాడులో ప్రధాన పట్టణాలు కోయంబత్తూరు, చెన్నై, మధురై లాంటి ప్రాంతాల్లో 80 శాతం నుంచి 90 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక తెలుగులో తొలి రోజు పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయిన ఈ చిత్రం రెండో రోజు గణనీయంగా అక్యుపెన్సీ నమోదు చేసింది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ లాంటి పట్టణాల్లో 30 నుంచి 50 శాతం వసూళ్లను రాబట్టింది.

ఉత్తరాదిలో హిందీ వెర్షన్‌కు

ఉత్తరాదిలో హిందీ వెర్షన్‌కు

ఉత్తరాదిలో హిందీ వెర్షన్ భారీగా వసూళ్లను రాబడుతున్నది. తొలి రోజు కంటే రెండో మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా 2 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. తొలి రోజున 1 కోటి షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు అదే జోష్‌ను ప్రదర్శించింది. ఈ చిత్రం ఫుల్‌రన్‌లో 15 కోట్ల వరకు హిందీలో రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

అమెరికా, ఇతర దేశాల్లో కలెక్షన్లు

అమెరికా, ఇతర దేశాల్లో కలెక్షన్లు

పొన్నియన్ సెల్వన్ చిత్రం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో భారీగా వసూళ్లను రాబడుతున్నది. కబాలీ, బిగిల్, ఇతర తమిళ సినిమా కలెక్షన్లతో పోటీపడుతున్నది. ఈ చిత్రం అమెరికాలోనే 3 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో తొలి రోజు 424,691 డాలర్లు, రెండో రోజు 389,432, మూడో రోజు తాజా సమాచారం ప్రకారం 187,810 డాలర్లు వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్లను అంటే .. 8.3 కోట్లు రాబట్టింది.

తొలి రోజే 80 కోట్ల గ్రాస్

తొలి రోజే 80 కోట్ల గ్రాస్

పొన్నియన్ సెల్వన్ చిత్రం తొలి రోజున తమిళనాడులో 36.5 దేశవ్యాప్తంగా షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళంలో 23.55 కోట్లు, తెలుగులో 4.45 కోట్లు, హిందీలో 2 కోట్ల గ్రాస్, మలయాళంలో 50 లక్షలు వసూలు చేసింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో కలిపి మొత్తం 80 కోట్లు రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు


తెలుగు రాష్ట్రాల్లో పొన్నియన్ సెల్వన్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి. తొలి రోజు 2.88 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, రెండో రోజున 2.3 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.18 కోట్ల షేర్, 9.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ 10 కోట్లు నమోదైంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 5 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.

రెండో రోజు 100 కోట్లు దాటి..

రెండో రోజు 100 కోట్లు దాటి..

ఇక పొన్నియన్ సెల్వన్ చిత్రం రెండో రోజున ప్రపంచవ్యాప్తంగా మరో 70 కోట్ల గ్రాస్ వసూలు చేయవచ్చనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో 20 కోట్లకుపైగా, తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్లకుపైగా నమోదు చేస్తుందని అడ్వాన్స్ బుకింగ్, అక్యుపెన్సీ ద్వారా స్పష్టమైంది. దేశవ్యాప్తంగా 32.5 కోట్లు వసూలు చేస్తుందని తాజా గణాంకాలు వెల్లడంచాయి. ఓవర్సీస్ మార్కెట్‌తో కలిపి ఈ సినిమా రెండో రోజు 150 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X