Ponniyin Selvan Collections: ఆదివారం ఊచకోత.. 10 రోజుల్లోనే అన్ని వందల కోట్లు.. తెలుగులో మరో షాక్
ఒకప్పుడు అతి భారీ చిత్రాలు తెరకెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించేలా చేసిన కోలీవుడ్.. కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రంగంలోకి దిగారు. తమిళ చిత్ర పరిశ్రమలోని చాలా మంది స్టార్ల కలయికలో 'పొన్నియన్ సెల్వన్' అనే భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించారు. పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' 10 రోజుల రిపోర్టు మీకోసం!

పిరియాడిక్ జోనర్‌లో వచ్చేసింది
మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందిన పిరియాడిక్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
ఎంతో మంది స్టార్లు నటించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

తెలుగులో 10వ రోజు వసూళ్లిలా
'పొన్నియన్ సెల్వన్' మూవీపై తమిళంలో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇక్కడా అత్యధిక బిజినెస్ చేసుకుని ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, ఆరంభంలో మంచి వసూళ్లనే రాబట్టినా.. క్రమంగా ఇది ప్రభావాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో 9వ రోజు ఈ మూవీ కేవలం రూ. 10 లక్షలు షేర్ వసూలు చేసింది.

10 రోజులకు తెలుగులో కలెక్షన్లు
10 రోజులకు 'పొన్నియన్ సెల్వన్' ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 83 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 70 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.64 కోట్లు షేర్, రూ. 16.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 8.64 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.86 కోట్లు వసూలు అయితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 10 రోజులకు కలిపి తెలుగులో రూ. 16.35 కోట్లు, తమిళంలో రూ. 156.70 కోట్లు, కర్నాటకలో రూ. 23.80 కోట్లు, కేరళలో రూ. 21.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 25.90 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 144.70 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 388.50 కోట్లు గ్రాస్, రూ. 200.00 కోట్లు షేర్ వచ్చింది.

10 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు
'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా 10 రోజుల్లో రూ. 200.00 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 68.00 కోట్లు లాభాలతో రికార్డును సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











