Ponniyin Selvan Collections: లాభాల దిశగా పొన్నియన్ సెల్వన్.. తెలుగులో 3 చోట్లు మినహా నష్టాలు
రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు మణిరత్నం. ఈ స్టార్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1.కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళ బాహుబలిగా అభివర్ణించారు. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీగానే దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' చిత్రం 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఓ లుక్కేద్దాం!

భారీ తారాగణంతో..
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన బిజినెస్..
భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్.

తెలుగులో 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు..
'పొన్నియన్ సెల్వన్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 11 రోజుల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ఏరియాలో కాస్త పెరిగాయి. మిగిలిన చోట్ల ఎప్పటిలానే కలెక్షన్లు ఉన్నాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 84 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 71 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.68 కోట్లు షేర్, రూ. 16.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 11 రోజుల్లో దీనికి రూ. 8.68 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.82 కోట్లు వసూలు అయితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చింది ఎంతంటే..
'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 11 రోజులకు కలిపి తెలుగులో రూ. 16.45 కోట్లు, తమిళంలో రూ. 161.80 కోట్లు, కర్నాటకలో రూ. 24.70 కోట్లు, కేరళలో రూ. 21.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 36.95 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 148.60 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400.10 కోట్లు గ్రాస్, రూ. 205.95 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా సక్సెస్ అవ్వాలంటే?
'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, ఈ చిత్రానికి 11 రోజుల్లో రూ. 205.95 కోట్ల షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్ తోపాటు 73.95 కోట్ల లాభాలతో రికార్డు సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











