Ponniyin Selvan Collections: 12వ రోజూ అన్ని కోట్లు.. ఓవరాల్‌గా కోట్ల లాభం.. తెలుగులో నష్టం ఎంతంటే!
కొంత కాలంగా దక్షిణాదిలోని ఇండస్ట్రీలన్నీ భారీ పాన్ ఇండియా చిత్రాలను రూపొందిస్తున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన మూవీ 'పొన్నియన్ సెల్వన్'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ మూవీ.. పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైంది. దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. దీంతో అప్పుడే లాభాల బాట కూడా పట్టేసింది. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' 12 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

పిరియాడిక్ యాక్షన్‌లో వచ్చింది
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పిరియాడిక్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ అయింది.

తెలుగులో 12వ రోజు వసూళ్లిలా
కోలీవుడ్‌లోని ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. దీనిపై తమిళంలో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇక్కడా అత్యధిక బిజినెస్ చేసుకుని ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, ఇక్కడ వసూళ్లు ఆశించిన రీతిలో రావట్లేదు. ఈ నేపథ్యంలో 12వ రోజు ఈ మూవీ కేవలం రూ. 3 లక్షలే రాబట్టింది.

12 రోజులకు తెలుగులో కలెక్షన్లు
'పొన్నియన్ సెల్వన్' 12 రోజులకు ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 84 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.71 కోట్లు షేర్, రూ. 16.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే
భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 8.71 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.79 కోట్లు వసూలు అయితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 12 రోజులకు కలిపి తెలుగులో రూ. 16.50 కోట్లు, తమిళంలో రూ. 165.30 కోట్లు, కర్నాటకలో రూ. 25.10 కోట్లు, కేరళలో రూ. 21.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 28.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 151.30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 408.40 కోట్లు గ్రాస్, రూ. 210.15 కోట్లు షేర్ వచ్చింది.

12 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు
'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా 12 రోజుల్లో రూ. 210.15 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 78.15 కోట్లు లాభాలతో రికార్డును సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











