Ponniyin Selvan Collections: శనివారం వసూళ్లు ట్రిపుల్.. అన్ని కోట్ల లాభాలు.. తెలుగులో మాత్రం ఇలా!
ఈ మధ్య కాలంలో సౌత్‌లో వచ్చే సినిమాలో దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తున్నాయి. దీంతో ఇక్కడి ఫిల్మ్ మేకర్లు వరుసగా పాన్ ఇండియా చిత్రాలనే తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఇలా రెండు వారాల క్రితమే విడుదలైన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ మూవీ.. పిరియాడిక్ యాక్షన్ జోనర్‌లో వచ్చింది. దీనికి ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఊహించని విధంగా భారీ స్థాయిలో వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' 16 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

పిరియాడిక్ యాక్షన్‌తో వచ్చింది
మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కిన పిరియాడిక్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ భారీ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య నిర్మించారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

తెలుగులో 16వ రోజు వసూళ్లిలా
తమిళంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. దీనిపై కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగా ఇక్కడా అత్యధిక బిజినెస్ చేసుకుని ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, ఇక్కడ వసూళ్లు ఆశించిన రీతిలో రావట్లేదు. ఈ నేపథ్యంలో 16వ రోజు మూడు రెట్లు పెరిగి రూ. 13 లక్షలు వచ్చాయి.

16 రోజులకు తెలుగులో కలెక్షన్లు
'పొన్నియన్ సెల్వన్' 16 రోజులకు ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 88 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 76 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, గుంటూరులో రూ. 54 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలతో.. రూ. 8.93 కోట్లు షేర్, రూ. 17.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే
క్రేజీ కాంబోలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 16 రోజుల్లో దీనికి రూ. 8.93 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.57 కోట్లు వసూలు అయితేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతూనే ఉంది. దీనికి 16 రోజులకు తెలుగులో రూ. 17.00 కోట్లు, తమిళంలో రూ. 182.85 కోట్లు, కర్నాటకలో రూ. 26.45 కోట్లు, కేరళలో రూ. 22.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 30.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 157.20 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 436.60 కోట్లు గ్రాస్, రూ. 224.50 కోట్లు షేర్ వచ్చింది.

16 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు
'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా 16 రోజుల్లో రూ. 224.50 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 92.50 కోట్లు లాభాలతో రికార్డును సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











