Ponniyin Selvan Collections: 130 కోట్ల బిజినెస్.. వారంలోనే అన్ని వందల కోట్లు.. తెలుగులో నష్టాలే!

తమిళ చిత్ర పరిశ్రమ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. దీంతో ఆ ఇండస్ట్రీ రేంజ్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదనే చెప్పాలి. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవలే 'విక్రమ్'తో సెన్సేషనల్‌ హిట్‌ను అందుకున్న కోలీవుడ్ నుంచి ఇటీవలే 'పొన్నియన్ సెల్వన్' అనే పిరియాడిక్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' వారం రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

కోలీవుడ్ బాహుబలిగా వచ్చింది

కోలీవుడ్ బాహుబలిగా వచ్చింది

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రం తమిళ బాహుబలిగా పేరొందింది.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

సూపర్ స్టార్ కాంబోలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ అయింది.

తెలుగులో ఏడవ రోజు వసూళ్లిలా

తెలుగులో ఏడవ రోజు వసూళ్లిలా


తమిళంలో రూపొందే చిత్రాలు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. దీనికితోడు ఎంతో మంది స్టార్లు నటించిన సినిమా కావడంతో 'పొన్నియన్ సెల్వన్' ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే ఆరంభం నుంచే కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో 7వ రోజు ఈ మూవీ కేవలం రూ. 9 లక్షలు షేర్‌ను మాత్రమే రాబట్టింది.

వారం రోజుల్లో తెలుగులో కలెక్షన్లు

వారం రోజుల్లో తెలుగులో కలెక్షన్లు

వారం రోజుల్లో 'పొన్నియన్ సెల్వన్' ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.56 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 67 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 53 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 51 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.35 కోట్లు షేర్, రూ. 15.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే

విజువల్ వండర్‌గా రూపొందిన 'పొన్నియన్ సెల్వన్'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 8.35 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.15 కోట్లు వసూలు అయితేనే ఇది హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి వారం రోజులకు కలిపి తెలుగులో రూ. 15.75 కోట్లు, తమిళంలో రూ. 125.90 కోట్లు, కర్నాటకలో రూ. 19.90 కోట్లు, కేరళలో రూ. 17.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 19.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 124.50 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 323.55 కోట్లు గ్రాస్‌, రూ. 166.80 కోట్లు షేర్ వచ్చింది.

వారంలోనే అన్ని కోట్ల లాభాలు

వారంలోనే అన్ని కోట్ల లాభాలు

'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ. 166.80 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 34.80 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X