Ponniyin Selvan Collections: తెలుగులో సంచలనం.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు.. టోటల్‌గా ఎంత వచ్చిందంటే!

గతంలో కంటే ఇప్పుడు దక్షిణాదిలో భారీ భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. దీనికి కారణం సౌత్ ఇండియా నుంచి వచ్చే మూవీలు బాలీవుడ్‌‌ను డామినేట్ చేస్తూ ఉండడమే. దీంతో ఇక్కడి ఫిల్మ్ మేకర్లు పాన్ ఇండియాను టార్గెట్ చేసి సినిమాలు రూపొందిస్తున్నారు. అలా తాజాగా విడుదలైన చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీగానే దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

పొన్నియన్ సెల్వన్‌ వచ్చిందిగా

పొన్నియన్ సెల్వన్‌ వచ్చిందిగా

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ టాక్.

తెలుగు మూడవ రోజు వసూళ్లిలా

తెలుగు మూడవ రోజు వసూళ్లిలా

'పొన్నియన్ సెల్వన్'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3 రోజు వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 14 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో.. రూ. 2.45 కోట్లు షేర్, రూ. 4.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

మూడు రోజుల్లో తెలుగు కలెక్షన్లు

మూడు రోజుల్లో తెలుగు కలెక్షన్లు

3 రోజులకు 'పొన్నియన్ సెల్వన్' ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 73 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 60 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 49 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 45 లక్షలు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో.. రూ. 7.63 కోట్లు షేర్, రూ. 14.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే

భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 7.63 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.87 కోట్లు వసూలు అయితేనే ఇది హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి మూడు రోజులకు కలిపి తెలుగులో రూ. 14.35 కోట్లు, తమిళంలో రూ. 73.55 కోట్లు, కర్నాటకలో రూ. 13.70 కోట్లు, కేరళలో రూ. 9.75 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 87.80 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 208.35 కోట్లు గ్రాస్‌, రూ. 107.80 కోట్లు షేర్ వచ్చింది.

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి రూ. 107.80 కోట్ల వరకే షేర్ వచ్చింది. అంటే ఇంకా ఇది రూ. 25 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X