Ponniyin Selvan Collections: అన్ని వందల కోట్లతో సంచలనం.. అప్పుడే కోట్లలో లాభం.. తెలుగులో మాత్రం!
ఈ మధ్య కాలంలో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా భారీ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అవి పెద్దగా బాక్సాఫీస్‌పై ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే విడుదలైన పాన్ ఇండియా సినిమానే 'పొన్నియన్ సెల్వన్'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. ప్రేక్షకుల నుంచి స్పందన మాత్రం భారీగానే దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీ ఆరు రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

భారీ స్టార్ కాస్ట్‌తో వచ్చిన చిత్రం
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపకల్పనలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రమే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
ఎంతో మంది స్టార్లు నటించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

తెలుగులో ఆరవ రోజు వసూళ్లిలా
తమిళ హీరోలకు ఆ రాష్ట్రంతో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. దీనికితోడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో 'పొన్నియన్ సెల్వన్' ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే ఆరంభం నుంచే కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఆరవ రోజైన బుధవారం ఈ మూవీ కేవలం రూ. 10 లక్షలు షేర్‌ను మాత్రమే రాబట్టింది.

ఆరు రోజుల్లో తెలుగులో కలెక్షన్లు
6 రోజులకు 'పొన్నియన్ సెల్వన్' ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 79 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 66 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 50 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.26 కోట్లు షేర్, రూ. 15.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 8.26 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.24 కోట్లు వసూలు అయితేనే ఇది హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 6 రోజులకు కలిపి తెలుగులో రూ. 15.55 కోట్లు, తమిళంలో రూ. 116.40 కోట్లు, కర్నాటకలో రూ. 18.60 కోట్లు, కేరళలో రూ. 16.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 17.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 116.35 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 301.25 కోట్లు గ్రాస్, రూ. 155.30 కోట్లు షేర్ వచ్చింది.

లాభాల బాట పట్టిన సినిమా
'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి రూ. 155.30 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 23.30 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.


Click it and Unblock the Notifications











