Ponniyin Selvan Collections: 8వ రోజూ అన్ని కోట్లు.. తెలుగులో నష్టాల దిశగా.. టోటల్ లాభాలు చూశారంటే!
ఈ మధ్య కాలంలో అన్ని భాషల్లోనూ మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలో వస్తుండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు అలాంటి చిత్రాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలా ఇటీవలే తమిళంలోని పలువురు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమానే 'పొన్నియన్ సెల్వన్'. పిరియాడిక్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో మొదలైంది. కానీ, కలెక్షన్లు మాత్రం దీనికి అత్యధికంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

క్రేజీ కాంబోలో వచ్చేసిన సినిమా
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
ఎంతో మంది స్టార్లు నటించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగింది.

తెలుగులో 8వ రోజు వసూళ్లు ఇలా
కోలీవుడ్‌లో రూపొందే చిత్రాలూ తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. దీనికితోడు ఎంతో మంది స్టార్లు నటించిన సినిమా కావడంతో 'పొన్నియన్ సెల్వన్' ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే ఆరంభం నుంచే కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో 8వ రోజు ఈ మూవీ కేవలం రూ. 8 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

8 రోజులకు తెలుగులో కలెక్షన్లు
8 రోజులకు 'పొన్నియన్ సెల్వన్' ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 81 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 68 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 42 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 51 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.43 కోట్లు షేర్, రూ. 15.90 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే
కోలీవుడ్ స్టార్ల కలయికలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 8.43 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.07 కోట్లు వసూలు అయితేనే ఇది హిట్ మూవీగా నిలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 8 రోజులకు కలిపి తెలుగులో రూ. 15.90 కోట్లు, తమిళంలో రూ. 134.40 కోట్లు, కర్నాటకలో రూ. 20.70 కోట్లు, కేరళలో రూ. 18.60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 21.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 129.30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 340.30 కోట్లు గ్రాస్, రూ. 175.35 కోట్లు షేర్ వచ్చింది.

8 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు
'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా 8 రోజుల్లో రూ. 175.35 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 42.35 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.


Click it and Unblock the Notifications











