twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ponniyin Selvan Collections: 9వ రోజు సంచలనం.. లాభాలతోనే రికార్డు.. తెలుగులో వసూళ్లు చూస్తే!

    |

    దక్షిణాదిలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తమిళ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా చిత్రాలు అంతగా రావడం లేదు. దీంతో ఈ సినిమాల రేంజ్ తెలుగు, కన్నడ భాషల కంటే పెరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. పిరియాడిక్ యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ భారీ బడ్జెట్‌ మూవీలో ఎంతో మంది స్టార్లు నటించారు. దీంతో ఇది ఆరంభంలోనే ఎన్నో అంచనాలు ఏర్పరచుకుని విడుదలైంది. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ లుక్కేయండి!

    భారీ బడ్జెట్‌తో వచ్చేసిన సినిమా

    భారీ బడ్జెట్‌తో వచ్చేసిన సినిమా

    మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ పాన్ ఇండియా మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చాడు.

    హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

    బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

    బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ అయింది.

    తెలుగులో 9వ రోజు వసూళ్లు ఇలా

    తెలుగులో 9వ రోజు వసూళ్లు ఇలా


    తెలుగులో కూడా తమిళ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. దీంతో ఆ సినిమాలన్నీ భారీగా విడుదల అవుతుంటాయి. ఈ క్రమంలోనే 'పొన్నియన్ సెల్వన్' ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా థియేటర్లలో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే ఆరంభం నుంచే కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ నేపథ్యంలో 9వ రోజు ఈ మూవీ కాస్త పెరిగి రూ. 11 లక్షలు షేర్‌ వసూలు చేసింది.

    <strong>లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!</strong><br />లోదుస్తులు కూడా లేకుండా నందినీ ఫోజులు: తెలుగమ్మాయి తెగింపు చూశారా!

     9 రోజులకు తెలుగులో కలెక్షన్లు

    9 రోజులకు తెలుగులో కలెక్షన్లు


    'పొన్నియన్ సెల్వన్' 9 రోజులకు ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 82 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 69 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 52 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలతో.. రూ. 8.54 కోట్లు షేర్, రూ. 16.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే

    టార్గెట్ ఎంత? ఎంత రావాలంటే


    భారీ బడ్జెట్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 10.00 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 8.54 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.96 కోట్లు వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

    <strong>విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట</strong><br />విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

     ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?


    'పొన్నియన్ సెల్వన్' ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 9 రోజులకు కలిపి తెలుగులో రూ. 16.15 కోట్లు, తమిళంలో రూ. 144.50 కోట్లు, కర్నాటకలో రూ. 22.10 కోట్లు, కేరళలో రూ. 19.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 23.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 136.60 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా రూ. 362.35 కోట్లు గ్రాస్‌, రూ. 186.60 కోట్లు షేర్ వచ్చింది.

    9 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు

    9 రోజుల్లోనే అన్ని కోట్ల లాభాలు

    'పొన్నియన్ సెల్వన్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 130 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 132 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా 9 రోజుల్లో రూ. 186.60 కోట్లు షేర్ వచ్చింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 54.60 కోట్లు లాభాలతో రికార్డును సొంతం చేసుకుంది.

    English summary
    Kollywood Star Director Mani Ratnam Did Ponniyin Selvan Movie With Huge Star Cast. This Movie Collects Rs 186.60 Crore in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X