PS 1: 2.ఓ రికార్డును బ్రేక్ చేసిన పొన్నియిన్ సెల్వన్.. అక్కడ నెంబర్ వన్ మూవీగా..
తమిళ చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో విడుదలైన పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అయితే మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. విడుదలైన మొదటి రోజు ఈ సినిమాకు కొంత డివైడ్ టాక్ అయితే వచ్చింది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అయితే మొదట్లో కలెక్షన్స్ కూడా అంతగా పెరగలేదు కానీ ఆ తర్వాత సినిమాకు వీకెండ్స్ తో పాటు హాలిడేస్ కూడా కలిసి రావడంతో కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ వచ్చాయి. ఇక తమిళనాడులో అయితే ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా తెరపైకి వచ్చిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. సినిమాలోని కథతో పాటు విజువల్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ కావడంతో తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లను దాటేసింది. దాదాపు 186 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు కూడా తెలుస్తోంది.

మిగతా రాష్ట్రాల్లో కూడా సినిమాకు కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. ఇక 2.0 సినిమా పేరిట ఉన్న ఓవర్సీస్ లరికార్డును కూడా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా బ్రేక్ చేయడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అందుకు సంబంధించిన నెంబర్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు యుఎస్ లో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న తమిళ సినిమాల్లో రజినీకాంత్ శంకర్ కలయికలో వచ్చిన 2.0 సినిమా మాత్రమే అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తుంది.
ఆ సినిమా దాదాపు 20 కోట్ల వరకు యూఎస్లో కలెక్షన్స్ అందుకుంది. అయితే ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా అంతకుమించి అనే స్థాయిలో సాలిడ్ కలెక్షన్స్ అయితే అందుకుంటుంది. మొత్తానికి ఈ సినిమా 20 కోట్ల మార్కును అందుకొని యుఎస్ లో పెట్టిన పెట్టుబడికి నిర్మాతలకు మంచి లాభాలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 362 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 17 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. కర్ణాటకలో కూడా 22 కోట్ల వరకు వచ్చాయి. ఇక కేరళలో కూడా 19 కోట్ల వరకు రావడం విశేషం.


Click it and Unblock the Notifications











